మహేష్ 26 కథ తెలిస్తే షాకే.. ప్రిన్స్ కెరీర్‌లోనే తొలిసారి.. సుకుమార్ మరో ప్రయోగం

భరత్ అనే నేను సినిమా తర్వాత సూపర్‌స్టార్ మహేష్ బాబు మంచి జోరు మీద కనిపిస్తున్నాడు. ఓ వైపు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తూనే మరో వైపు తన తదుపరి చిత్రంపై దృష్టిపెట్టాడు. రంగస్థలం రికార్డు హిట్‌తో చెలరేగిన దర్శకుడు సుకుమార్‌తో మహేష్ జతకడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ పొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్టు తెలిసింది. అయితే ఈ సినిమా కథకు సంబంధించి బయటకు వచ్చిన విషయం ఆసక్తిని రేపుతున్నది. అదేమిటంటే..

సుకుమార్‌తో నేనొక్కడినే

సుకుమార్‌తో నేనొక్కడినే

ప్రిన్స్ మహేష్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 1 నేనెక్కొడినే చిత్రం భారీ అంచనాల రిలీజైనప్పటికీ.. ప్రేక్షకులను, సినీ విమర్శకులను ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ప్రారంభ కలెక్షన్లు భారీగా ఉన్నప్పటికీ వాటిని నిలదొక్కొకోలేకపోవడంతో ఫ్లాప్‌ పేరు మూటగట్టుకొంది.

 మహేష్ 26 కథపై ఆసక్తిగా

మహేష్ 26 కథపై ఆసక్తిగా

అయితే రంగస్థలం తర్వాత మహేష్‌తో భారీ హిట్ కొట్టేందుకు సుకుమార్ ప్లాన్స్ వేస్తున్నాడు. మహేష్ కెరీర్‌లో 26వ చిత్రంగా రూపొందబోయే సినిమాను చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ కథపై సుకుమార్ టీం భారీగా కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికను త్వరలో అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

ఇండిపెండెన్స్‌కు ముందు స్టోరితో

ఇండిపెండెన్స్‌కు ముందు స్టోరితో

తాజా సమాచారం ప్రకారం.. తమ కాంబినేషన్‌లో వచ్చే సినిమా కోసం సుకుమార్, మహేష్‌బాబు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టు తెలిసింది. స్వాతంత్య్ర పోరాటానికి ముందు జరిగే సంఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలిసింది. ఒకవేళ అదే నిజమైతే మహేష్ కెరీర్‌లోనే తొలి హిస్టారికల్ మూవీ కానున్నది.

 మైత్రీ మూవీస్ నిర్మాణంలో

మైత్రీ మూవీస్ నిర్మాణంలో

శ్రీమంతుడు లాంటి భారీ సక్సెస్‌ను మహేష్‌కు, రంగస్థలం లాంటి సక్సెస్ను సుకుమార్‌కు అందించిన మైత్రీ మూవీస్ ఈ సినిమాను నిర్మిస్తున్నది. ప్రస్తుతం మహేష్ మహర్షి చిత్ర సినిమా షూటింగ్‌ బిజీలో ఉన్నాడు. ఆ సినిమా పూర్తయిన వెంటనే సుకుమార్ సినిమాలో మహేష్ జాయిన్ అవుతారని తెలిసింది.

భారీ అంచనాలతో

భారీ అంచనాలతో

తన 26వ సినిమాను చారిత్రక నేపథ్యంగా తెరకెక్కిస్తున్నారనే విషయంతో అభిమానులుల్లో అంచనాలు పెరిగాయి. ట్రేడ్ వర్గాల్లో కూడా పలు చర్చకు దారి తీస్తున్నది. సుకుమార్, మహేష్ కెరీర్‌లో ది బెస్ట్‌గా నిలుస్తుందా అనే విషయంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X