పుష్ప కోసం బాధతో ప్లాన్ చేంజ్ చేసిన సుకుమార్.. అల్లు అర్జున్ ఫుల్ హ్యాపీ!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొదటిసారి ఒక పాన్ ఇండియా సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పుష్ప సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా అల్లు అర్జున్ సరికొత్త పాత్రతో అలరించబోతున్నాడు. ఈ సినిమా కథ మెయిన్ గా శేషాచలం అడవుల ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో నడవనున్నట్లు ఇప్పటికే ఒక టాక్ వైరల్ అయ్యింది.
ఇక సినిమాలో యాక్షన్ సన్నివేశాలను కూడా దర్శకుడు హై బడ్జెట్ లో డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అసలైతే ఈ సినిమాను కేరళ అడవుల్లో ఎక్కువగా చిత్రీకరించాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ తెలంగాణలోనే కొన్ని చిన్న అడవులలో షూట్ చేసేందుకు కొత్త ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. మెయిన్ ఒక కేరళ అడవి ప్రాంతంలోనే ఒక విలేజ్ సెట్ వేయాలని అనుకున్నారట దర్శకుడు సుకుమార్. కానీ కరోనా కారణంగా దాన్ని క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది.

ఓ విధంగా ఆ షెడ్యూల్ కోసం సుకుమార్ చాలా ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఊహించని విదంగా లాక్ డౌన్ దెబ్బకొట్టడంతో ఇప్పుడు సెట్ ని హైదరాబాద్ స్టూడియోలలో నిర్మించేందుకు సిద్ధమయ్యారు. రీ షెడ్యుల్ కారణంగా బన్నీకి ఇంటి నుంచి దూరమయ్యే బాధ తప్పింది. హైదరాబాద్ లోనే ఉంటూ హ్యాపీగా షూటింగ్ చేసుకోవచ్చని హ్యాపీగా ఫీల్ అవుతున్నాడట. కానీ సుకుమార్ చేసేదేమీ లేక మంచి రియాలిటీ లొకేషన్స్ ని మిస్ అవుతున్నామని బాధతోనే రీ షెడ్యూల్ చేసుకున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











