ఎన్టీఆర్-సుకుమార్ చిత్రం టైటిల్ ఇదా??
హైదరాబాద్ :ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు సుకుమార్ ఓ సినిమాని ఓకే అయినప్పటినుంచి మీడియాలో,ఫిల్మ్ సర్కిల్స్ లో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. తాజాగా ఈ చిత్రం టైటిల్ ఫైనల్ అయ్యిందని చెప్తున్నారు. వారు చెప్పేదాని ప్రకారం ఈ చిత్రం టైటిల్ 'యంగ్ స్టార్' . 'అత్తారింటికి దారేది' నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 2014 సమ్మర్ లో ఈ చిత్రం ప్రారంభం కానుంది.
ఇక ఈ చిత్రానికి రిలియన్స్ వారు కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహిస్తారు. గత మూడు చిత్రాలుగా బి.వియస్ ఎన్ ప్రసాద్ అశోశియేషన్ లో ఉన్న రిలియన్స్ వారు..ఈ సినిమాతో మళ్లీ తమ అశోశియేషన్ ని ఎక్సటెండ్ చేసారు. ముఖ్యంగా ఎన్టీఆర్ తో బి.వియస్ ఎన్ ప్రసాద్ కుమారుడు బాపినీడు కు ఉన్న స్నేహంతో ఈ ప్రాజెక్టుకి ఇమ్మిడియట్ గా ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెప్తున్నారు. అప్పటివరకూ ప్లాఫ్ లతో లాస్ లలో ఉన్నా 'అత్తారింటికి దారేది' ఘన విజయంతో నిర్మాతగా ఒడ్డున పడ్డారు ప్రసాద్.

ఊసరవెల్లితో నష్టపోయిన...నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ కు ఎన్టీఆర్ కాంపన్ షేషన్ గా చేస్తున్న చిత్రంగా... ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.ఇంతకాలం యూత్, అండ్ కాలేజీ స్టోరీలతో సినిమాలను రూపొందించిన సుకుమార్....ఎన్టీఆర్‌తో చేసే సినిమాతో సరికొత్త కాన్సెప్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని, తెలుగులో ఇప్పటి వరకు రానటువంటి పూర్తి భిన్నమైన కాన్సెప్టును రెడీ చేస్తున్నారని తెలుస్తోంది.
సుకుమార్ చెప్పిన కథ వినగానే ఎన్టీఆర్ ఎగ్జయిట్ అయినట్లు సమాచారం. సుకుమార్ ప్రస్తుతం మహేశ్‌తో '1.. నేనొక్కడినే' చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పూర్తవగానే ఎన్టీఆర్ సినిమా మొదలు కానున్నది. ఎన్టీఆర్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. 2013 వేసవికి 'బాద్‌షా'గా వచ్చారు. తర్వాత 'రామయ్యా వస్తావయ్యా' గా వచ్చి అలరించలేకపోయారు. ఇప్పుడు సంతోష్ శ్రీనివాస్‌తో ఓ చిత్రం సెట్స్ ఉంది. ఈ చిత్రం ఖచ్చితంగా కొత్త తరహాలో యూత్ ని ఆకట్టుకునేలా ఉంటుందని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











