ఆర్య-3... సినిమాకు రంగం సిద్ధం!

By Bojja Kumar

హైదరాబాద్: అల్లు అర్జున్ కెరీర్‌కి బాగా ప్లస్సయిన సినిమా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'ఆర్య'. ఆ తర్వాత వచ్చిన ఆర్య 2 కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో మెగా ఫ్యామిలీకి బాగా దగ్గరయ్యాడు దర్శకుడు సుకుమార్. ఆయనకు స్టార్ డైరెక్టర్ హోదాను తెచ్చింది కూడా ఆర్య సినిమానే.

తాజాగా దర్శకుడు సుకుమార్ ఆర్య-3 చిత్రానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇది వరకు వచ్చిన ఆర్య-2 చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రం సాగుతుందని, ఈ చిత్రంలో కూడా అల్లు అర్జున్, నవదీప్ కలిసి నటించనున్నారని ఫిల్మ్ నగర్ టాక్. అయితే హీరోయిన్, ఇతర పాత్రలు మాత్రం మారే అవకాశం ఉందంటున్నారు.

ప్రస్తుతం సుకుమార్ మహేష్ బాబుతో సినిమా చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత ఆర్య-3 చిత్రంపై పూర్తి ఫోకస్ పెట్టనున్నాడు ఈ క్రేజీ దర్శకుడు. ఈ లోగా అల్లు అర్జున్ ఇప్పటికే తాను కమిటైన ప్రాజెక్టులు పూర్తి చేసుకుని సుకుమార్ దర్శకత్వంలో రాబోయే సినిమాకు సిద్ధం కానున్నాడు.

ఆర్య-3 చిత్రం గురించి సుకుమార్, బన్నీ మధ్య కథా చర్చలు జరిగాయని, స్క్రిప్టు ఒక్కటే బ్యాలెన్స్ ఉందని వారి సన్నిహితులు అంటున్నారు. త్వరలోనే ఈచిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఇద్దరమ్మాయిలతో' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X