Allu Arjun: పుష్ప 2 ఇంటర్వెల్ లీక్.. ఇండియాలో ఏ సినిమాలో చూపించని విధంగా!
ఈ మధ్య కాలంలో మిగిలిన భాషల కంటే తెలుగులో రూపొందిన చాలా చిత్రాలు దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అలాంటి వాటిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన 'పుష్ప ది రైజ్' ఒకటి. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం దేశం మొత్తాన్ని ఊపు ఊపేసి కోట్ల వసూళ్లతో చరిత్రను సృష్టించింది.
'పుష్ప ది రైజ్' సూపర్ హిట్ అవడంతో ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా 'పుష్ప ది రూల్' మూవీని తీస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్‌ను చిత్ర యూనిట్ ఎంతో ఉత్సాహంతో జరుపుతోంది. ఇలా ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా వరకూ టాకీ పార్టును కూడా కంప్లీట్ చేసుకున్నారు. మిగిలిన భాగాన్ని కూడా పూర్తి చేసుకోవాలన్న పట్టుదలతో వర్క్ చేస్తున్నారు.

క్రేజీ హిట్‌కు కొనసాగింపుగా వస్తున్న 'పుష్ప ది రూల్'పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే దీన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన గ్లింప్స్ వీడియోకు అదిరిపోయే స్పందన కూడా వచ్చింది. అదే సమయంలో ఈ మూవీకి సంబంధించి ఎన్నో కీలకమైన అంశాలు కూడా లీక్ అవుతూనే ఉన్నాయి.
సాధారణ కూలీగా ప్రయాణం మొదలుపెట్టి ఎర్ర చందనం స్మగ్లింగ్‌లో పుష్పరాజ్ పెద్ద డాన్‌గా ఎలా రూల్ చేశాడు అన్న పాయింట్‌తో 'పుష్ప ద రూల్' రూపొందుతోంది. ఇందులో ఫస్ట్ పార్ట్ కంటే అన్నీ హై రేంజ్‌లోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో వచ్చే ఇంటర్వెల్ ఎపిసోడ్ గురించి తాజాగా ఓ న్యూస్ లీక్ అయింది.
మామూలుగా ఏ కమర్షియల్ సినిమాలో అయినా ఇంటర్వెల్ సమయంలో భారీ యాక్షన్ సీక్వెన్స్ పెడతారు. అయితే, తాజాగా లీకైన సమాచారం ప్రకారం 'పుష్ప ది రూల్' మూవీలో మాత్రం ఫైట్‌ను కాకుండా ఎమోషనల్ సీన్‌ను పెట్టారని తెలిసింది. ఇది గుండెలు పిండేసే ఫీల్‌ను కలిగిస్తుందని తెలిసింది. గతంలో ఏ మాస్ మూవీలోనూ ఇలాంటి సీన్ పెట్టలేదనే చెప్పాలి.

ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో వస్తున్న 'పుష్ప ద రూల్' సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా చేస్తోండగా.. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా నటిస్తున్నాడు. సునీల్, అనసూయ కీలక పాత్రలు చేయనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం ఇస్తున్నాడు. ఈ మూవీ ఆగస్టు 15న విడుదల కాబోతుంది.


Click it and Unblock the Notifications











