కాంట్రాక్ట్ లో ఇరుక్కపోయిన సుకుమార్
సుకుమార్ కి తన తాజా చిత్రం '100% లవ్'హిట్టవటం పెద్ద ఆనందాన్ని కలిగించటం లేదు. దానికి కారణం అతను అంతకుముందు చేసుకున్న కాంట్రాక్ట్ ఎగ్రిమెంట్. 'జగడం', 'ఆర్య 2' సినిమాల నిర్మాత ఆదిత్యబాబు అదను చూసి దెబ్బకొట్టాడు. 'ఆర్య 2' షూటింగ్‌కు ముందే ఆ సినిమాని ప్రొడ్యూస్ చేసిన ఆదిత్య ఆర్ట్స్ బేనర్‌తో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ సుకుమార్ ని ఇప్పుడు ఇబ్బందుల్లో తోసేసింది. దాని ప్రకారం అతడు ఆ బేనర్ ఓనర్, నటుడు అయిన ఆదిత్యబాబుతో ఓ సినిమా చేయాలి. కానీ సుకుమార్ కు ఇప్పుడు అతనితో సినిమా చేసే ఆలోచన అస్సలు లేదు.
మహేష్ బాబు నుంచి ఆఫర్ రావటంతో అతను ఆ స్క్రిప్టు చేసుకుందామనుకున్నాడు. అయితే ఇప్పుడు ఆదిత్యబాబు సీన్ లోకి వచ్చి ఎగ్రిమెంట్ ను గుర్తు చూసి తనతో సినిమా చేయమని ఒత్తిడి చేస్తున్నాడు.'100% లవ్'హిట్ తన జగడం, ఆర్య 2 చిత్రాల ప్లాప్ లను కవర్ చేస్తుందని బావిస్తున్నాడు. అంతేగాక తననే డైరక్ట్ చేయమని ఆదిత్యబాబు పట్టుపడుతున్నాడు.'చలాకీ'వంటి ప్లాప్ సినిమాతో తెలుగులో పరిచయమైన ఆదిత్య బాబు ఎలాగైనా సుకుమార్ దర్శకత్వంలో చేసి హిట్ అనిపించుకోవాలని ఉన్నాడు. సుకుమార్ కి ఏమి చేయాలో అర్దం కాని స్ధితి ఏర్పడింది.


Click it and Unblock the Notifications