పుష్ప సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ జీవితం.. ముందే అనుమతి తీసుకొని..

టాలీవుడ్ బిగెస్ట్ పాన్ ఇండియా సినిమాల్లో పుష్ప సినిమా ఒకటి. అల్లు అర్జున్ మొదటిసారి చేస్తున్న ఈ బిగ్ బడ్జెట్ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు గాని అంచనాలు మాత్రం భారీగానే ఉన్నాయి. హిందీ డబ్బింగ్ సినిమాలతో నార్త్ ఆడియెన్స్ కు ఎంతగానో దగ్గరైన బన్నీ పుష్ప సినిమాతో తప్పకుండా హిట్ కొట్టగలడని ఒక బలమైన టాక్ అయితే వస్తోంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ సినిమా కథలో కొన్ని అంశాలు జూనియర్ ఎన్టీఆర్ జీవితానికి దగ్గరగా ఉంటాయని తెలుస్తోంది.

పుష్ప కథపై రూమర్స్

పుష్ప కథపై రూమర్స్

కథ ఏదైనా కూడా డైరెక్టర్ విజన్ లో స్క్రీన్ ప్లే కాస్త డిఫరెంట్ గా ఉంటే చాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంటాయి. అయితే పుష్ప సినిమాపై కూడా గత కొంత కాలంగా అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. సినిమా అయితే పూర్తిగా ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్నట్లు పోస్టర్స్ ద్వారానే అర్ధమయ్యింది. ఇక పుష్ప రాజ్ పాత్రలో బన్నీ పాత్రను బాగానే హైలెట్ చేస్తున్నాడు సుకుమార్.

ఎన్టీఆర్ జీవితానికి దగ్గరగ ఉంటుందట

ఎన్టీఆర్ జీవితానికి దగ్గరగ ఉంటుందట

ఇక సినిమా కథపై ఇప్పుడు ఒక కొత్త తరహా గాసిప్ వైరల్ గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ నిజజీవితానికి సంబంధించిన కొన్ని కీలకమైన సంఘటనలను ఆధారంగా చేసుకొని దర్శకుడు కథ రాసుకున్నాడట. సుకుమార్ తో తారక్ నాన్నకు ప్రేమతో అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమాతోనే ఇద్దరు చాలా క్లోజ్ అయ్యారు. ఒక స్నేహితుడిగా భావించి తారక్ తన జీవితానికి సంబంధించిన సంతోషాలను చిన్నప్పటి బాధలను సుక్కుతో షేర్ చేసుకున్నాడట.

అనుమతి తీసుకొని కాథ రాసుకున్న సుక్కు

అనుమతి తీసుకొని కాథ రాసుకున్న సుక్కు

అయితే తారక్ చిన్నప్పుడు తండ్రికి దూరంగా ఉంటూ తల్లీ ఇచ్చే మనో ధైర్యంతోనే నాట్యంలో నటనలో రాటు దేలాడు. నిజం చెప్పాలి అంటే తారక్ కనిపించని గాయలతోనే ఇంతటి వాడయ్యారని జనాలందరికి తెలుసు. ఇక ఎన్టీఆర్ సుకుమార్ కు ఏం చెప్పాడో ఏమో గాని పుష్ప కథ కొంచెం అటు ఇటుగా తారక్ బాల్యానికి దగ్గరగానే ఉంటుందట. ముందుగానే అనుమతి తీసుకొని సుక్కు కథ రాసుకున్నట్లు సమాచారం.

Recommended Video

Ram Pothineni Don't Want 'A Aa' Kind Of Movie From Trivikram
బలంగా సిద్దమవుతున్న నిర్మాతలు

బలంగా సిద్దమవుతున్న నిర్మాతలు

ఇక పుష్ప సినిమా కోసం దాదాపు 250కోట్ల వరకు ఖర్చు చేయడానికి మైత్రి మూవీ మేకర్స్ చాలా బలంగా సిద్ధమైంది. ఇప్పటికే కొంత వరకు షూటింగ్ పూర్తి చేశారు. కరోనా కారణంగా కొంత గ్యాప్ రావడంతో మళ్ళీ షెడ్యూల్స్ లలో ప్లాన్ చేంజ్ చేశారు. ఇక సినిమాకు సంబంధించిన మరో షెడ్యూల్ ని ఇటీవల సింపుల్ గా స్టార్ట్ చేసేశారు. నిహారిక పెళ్లి ఉండడంతో కాస్త గ్యాప్ ఇచ్చిన బన్నీ మళ్ళీ ఈ వారం ఏండింగ్ లోనే పుష్ప టీమ్ ను కలవబోతున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X