Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అనుకున్నట్లే అయ్యింది.. పుష్ప ఇక తప్పుకోక తప్పదు!
టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమాగా తెరకెక్కుతున్న వాటిలో పుష్ప సినిమా ఒకటి. గతంలో ఎప్పుడు లేని విధంగా అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాల డోస్ పెంచేశాయి. ఇప్పటికే ఫస్ట్ లుక్ టీజర్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.
మరో చందమామ లాంటి గ్లామర్.. మధుమితా హాట్ లుక్స్
ఇక సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువైనప్పటికి సుకుమార్ టీమ్ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే షూటింగ్స్ చేస్తూ వచ్చింది. వారంలో డే బై డే గ్యాప్ తీసుకుంటూ షూటింగ్ చేశారు. అయినప్పటికీ కోవిడ్ దెబ్బ కొట్టింది. ఇక ఇంతలో అల్లు అర్జున్ కూడా కరోనా బారిన పడటం చిత్ర యూనిట్ ను మరింత టెన్షన్ లో పడేసింది. ఇక మొదట ఊహించినట్లే సినిమా వాయిదా పడక తప్పేలా లేదని ఒక క్లారిటీ వచ్చింది. ఎలాగైనా సరే ఆగస్ట్ 13న సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్న సుకుమార్ ప్లాన్స్ ఒక్కసారిగా తారుమరయినట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్ మరికొన్ని రోజులు గ్యాప్ తీసుకోక తప్పదు. దీంతో షూటింగ్ ను కొన్నాళ్ళు ఆపడమే మంచిదని మరొక కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక మరొక రిలీజ్ డేట్ దొరకాలి అంటే చాలా కష్టమైన పని. మరొక పెద్ద సినిమా RRR లేదా మరేదైనా వాయిదా పడితే దసరా టైమ్ లో తేవాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇక ఆగస్ట్ లో పుష్ప రావాల్సిన డేట్ కు మెగాస్టార్ చిరంజీవి ఆచార్య రావచ్చని మరొక రూమర్ వస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..