మైత్రి నిర్మాతల వద్ద సుకుమార్ డిమాండ్.. పైకంపై పంథా మార్చేస్తూ! బన్నీ సినిమాకు భలే స్కెచ్..

Recommended Video

#AA20 Movie LAunch | Allu Arjun - Sukumar Movie Launch Event

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తన కొత్త సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. రంగస్థలం సినిమా సక్సెస్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఆయన, అల్లు అర్జున్‌తో తన తాజా సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఎంత క్రియేటివ్‌గా స్క్రిప్ట్ రాశాడో.. అంతే క్రియేటివ్‌గా పైకం గురించి ఆలోచిస్తున్నాడట సుకుమార్. ఈ మేరకు తన డిమాండ్‌ని మైత్రి నిర్మాతల వద్ద పెట్టేశారని తెలుస్తోంది. వివరాల్లోకి పోతే..

 అల్లు అర్జున్- సుకుమార్.. ముహూర్తం కుదిరింది

అల్లు అర్జున్- సుకుమార్.. ముహూర్తం కుదిరింది

ఓ వైపు 'అల.. వైకుంఠపురములో' షూటింగ్‌లో పాల్గొంటూనే.. తన తదుపరి సినిమాకు ముహూర్తం పెట్టేశారు అల్లు అర్జున్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు కమిట్ అయ్యారు. అక్టోబర్ 30వ తేదీన ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని లాంఛనంగా ప్రారంభమైంది.

పైకంపై పంథా మార్చేస్తూ

పైకంపై పంథా మార్చేస్తూ

ఈ మధ్యకాలంలో దర్శకులు పైకంపై పంథా మార్చేస్తున్నారు. ఇదివరకటిలా డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించినందుకు గాను రెమ్మూనరేషన్ తీసుకోకుండా సినిమా బిజినెస్‌లో భాగమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే సుకుమార్ కూడా ఓ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అల్లు అర్జున్‌తో తాను రూపొందించనున్న సినిమాకు రెమ్మూనరేషన్ నిరాకరించారట సుకుమార్.

నిర్మాతల వద్ద సుకుమార్ డిమాండ్

నిర్మాతల వద్ద సుకుమార్ డిమాండ్

ఈ మేరకు మైత్రి నిర్మాతల ముందు సుకుమార్ ఓ డిమాండ్ పెట్టారని తెలిసింది. విడుదలకు ముందు, విడుదల తర్వాత సినిమా చేసే బిజినెస్‌లో షేర్ కావాలని కోరారట సుక్కు. ఈ మేరకు తనకు రెమ్మూనరేషన్ అవసరం లేదని తెగేసి చెప్పారట. ఈ విషయమై చర్చలు జరిపిన మైత్రి నిర్మాతలు చివరకు ఓకే చెప్పేశారని సమాచారం.

నెల ఖర్చులు.. అచ్చం సాలరీ లాగే

నెల ఖర్చులు.. అచ్చం సాలరీ లాగే

మైత్రి నిర్మాతలు, సుకుమార్ మధ్య జరిగిన చర్చల్లో ఓ ఒప్పందం కుదిరిందని టాక్ నడుస్తోంది. సినిమా పూర్తయ్యేవరకు నెల నెలా ఖర్చుల నిమిత్తం మైత్రి నిర్మాతల నుంచి కొంత సొమ్ము తీసుకుంటారట సుక్కు. మంత్లీ సాలరీ లాగే ఈ అమౌంట్ సుకుమార్‌కి అందనుందని తెలుస్తోంది. ఇదిగాక సినిమా అంతా పూర్తయ్యాక ఆ సినిమా చేసే బిజినెస్‌లో షేర్ తీసుకుంటారట సుకుమార్.

 వచ్చే ఏడాది.. గంధపు చెక్కల స్మగ్లింగ్

వచ్చే ఏడాది.. గంధపు చెక్కల స్మగ్లింగ్

గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో రెడీ చేసిన స్క్రిప్ట్‌తో రంగంలోకి దిగుతున్నారట సుకుమార్. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించనుంది. అతిత్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X