twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బెడిసికొట్టిందా? సొంత బేనర్లోనే సుకుమార్ అన్న కొడుకు హీరోగా...!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: సినిమా రంగంలో పలువురు హీరోలు, నిర్మాతలు, దర్శకుడు, ఇతర నటీనటులు తమ వారసులనో, బంధువులను సినీ రంగానికి పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్టులో దర్శకుడు సుకుమార్ కూడా చేరిపోయాడు. దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా మల్టీ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ గా పేరు తెచ్చుకున్న సుకుమార్ తన అన్నకొడుకును హీరోగా పరిచయం చేయబోతున్నారట.

    సుకుమార్ ఇప్పటికే 'సుకుమార్‌ రైటింగ్స్‌' పేరుతో నిర్మాణ సంస్థను పెట్టి అందులో కుమారి 21 ఎఫ్ లాంటి హిట్ చిత్రాలు చేసారు. తాజాగా ఆయన మరో బేనర్ పెడుతున్నట్లు సమాచారం. తన తండ్రి బండ్రెడ్డి తిరుపతి నాయుడు పేరు మీద బిటిఆర్ క్రియేషన్స్ అని పెడుతున్నట్టు తెలుస్తోంది.

    Sukumar's Nephew Ashok turns hero

    ఈ బ్యానర్‌లో రానున్న తొలి సినిమాకు సుకుమార్ కథారచన చేయనుండగా, హీరోగా తన అన్న కొడుకు బండ్రెడ్డి అశోక్‌ను పరిచయం చేయనున్నట్టు ఫిల్మ్ నగర్లో చర్చ సాగుతోంది. ఈ చిత్ర షూటింగ్ 9న ప్రారంభం కానుండగా, ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు హరిప్రసాద్ దర్శకత్వం వహిస్తారని టాక్. ఈ చిత్రంలో 'అంతకుము ఆ తరువాత' మూవీ ఫేమ్ ఈషా నటించనుందని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు సుకుమార్ అఫీషియల్ గా ప్రకటించే అవకాశం ఉంది.

    ప్రయత్నయం బెడిసి కొట్టిందా?
    అశోక్ ఇంతకు ముందు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 100% లవ్, '1-నేనొక్కడినే' చిత్రాలకు అసిస్టెంటు డైరెక్టర్ గా పని చేసారు. అశోక్ ను ఇప్పటికే ప్రభాకర్ రెడ్డి నిర్మాతగా, శ్రీరామ్ చల్ల దర్శకత్వంలో పరిచయం చేయాలని ప్రయత్నాలు జరిగాయి. ఎందుకనో ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఇపుడు సొంత బేనర్లోనే అతన్ని హీరోగా పరిచయం చేయడానికి ప్లాన్ చేసారు సకుమార్.

    English summary
    Ashok Nephew of Director Sukumar is getting launched in as hero soon with the director Hari Prasad in director mode. Ashok earlier worked as Assistant director to Sukumar for films like 100% love and 1 Nenokkadina.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X