'పుష్ప' కోసం బాలీవుడ్ బ్యూటీలపై కన్నేసిన బన్నీ గ్యాంగ్?
తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరు పాన్ ఇండియా ఆకలిని తీర్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఎలాగైనా బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలని బడ్జెట్ గురించి పట్టించుకోకుండా కష్టపడుతున్నారు. కాన్సెప్ట్ బావుంటే భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమా చూస్తారని సౌత్ టెక్నీషియన్స్ కి ఒక క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాతో రెడీ అవుతున్న వారిలో అల్లు అర్జున్ ఒకరు.
సుకుమార్ దర్శకత్వంలో బన్నీ 'పుష్ప' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కి బ్రేక్ చెప్పిన చిత్ర యూనిట్ ప్రస్తుతం కొత్త షెడ్యూల్స్ ని ప్లాన్ చేసుకుంటోంది. అయితే సినిమాకు సంబంధించిన కొన్ని కీలక నిర్ణయాలపై దర్శకుడు ఇటీవల బన్నీతో చర్చించినట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా సినిమాలో ఐటెమ్ సాంగ్ కోసం మంచి హీరోయిన్ ని సెట్ చేయాలని అనుకుంటున్నారట.

ఇప్పటికే దేవి శ్రీ ప్రసాద్ ఐటెమ్ సాంగ్ కోసం అదిరిపోయే ట్యూన్ రెడీ చేశారట. ఇక అందుకోసం బాలీవుడ్ నుంచి ఒక హాట్ బ్యూటీని దింపాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే పాన్ ఇండియా సినిమా కాబట్టి అన్ని భాషలకు తెలిసిన హీరోయిన్ అయితే బెటర్ అని చిత్ర యూనిట్ కత్రినా కైఫ్, జాక్వాలిన్ ఫెర్నాండెజ్, మలైకా అరోరా వంటి వారిని సంప్రదిస్తున్నారట.
ఒకవేళ వారు రెమ్యునరేషన్ ఎక్కువగా డిమాండ్ చేస్తే దిశా పటాని, పూజా హెగ్డే వంటి వారిని ఫైనల్ చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి సుకుమార్ ఎవరిని ఫిక్స్ చేస్తాడో తెలియాలి అంటే మారికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











