"పుష్ప 2" కి సుకుమార్ రెమ్యూనరేషన్ వింటే షాకివ్వాల్సిందే.. ఇన్ని కోట్లా?
ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్లో ఓ రేంజ్ లో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2" ఒకటి అని చెప్పాలి. కాగా ఈ సినిమాపై ఉన్న హైప్ వేరే, కానీ ఈ క్రెడిట్ అంతా దాదాపు అల్లు అర్జున్ కే అంతా ఇస్తున్నారు. కానీ అల్లు అర్జున్ అండ్ చిత్ర యూనిట్ మాత్రం పుష్ప క్రెడిట్ ని మాత్రం తమ దర్శకుడు సుకుమార్ కే అందిస్తున్నారు.
సుకుమార్ లేనిదే నేను లేను, పుష్ప కూడా లేదు అని బన్నీ పార్ట్ 1 సక్సెస్‌మీట్‌లోనే చెప్పి ఎమోషనల్ అయ్యాడు. పుష్ప అనే రోల్ ని క్రియేట్ చేసింది సుకుమార్.. తన విజన్ తో అల్లు అర్జున్ పాన్ ఇండియా ఇమేజ్ చెక్ చేసుకొని సక్సెస్ అయ్యాడు. అయితే పుష్ప పార్ట్ 1 బిగ్ హిట్ అయ్యే సరికి పార్ట్ 2 విషయంలో మాత్రం సుకుమార్ పై ఒత్తిడి పడింది.

దీనితో ఎలాగైనా పార్ట్ 2 ని మరింత స్ట్రాంగ్ గా గ్రాండ్ గా తీయాలని ఫిక్స్ చేసి అనుకున్నట్టు గానే ట్రైలర్ తో పుష్ప 2 అంటే ఏంటో చూపించారు సుకుమార్. సరే ఇదంతా బాగానే ఉంది కాని పుష్ప 2 కోసం అల్లు అర్జున్ ఏకంగా రూ.300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడని వచ్చిన పలు వార్తలు ఓ రేంజ్ లో షాకిచ్చిన సంగతి తెలిసిందే.
తాజాగా పుష్ప పార్ట్ 2 కోసం దర్శకుడు సుకుమార్ తీసుకున్న రెమ్యునరేషన్ అంటూ ఓ షాకింగ్ ఫిగర్ ఇపుడు వినిపిస్తుంది. ఈ సినిమాకి సుకుమార్ ఛార్జ్ చేసింది అక్షరాల రూ.150 కోట్లకు పైమాటే.. అని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇది మాత్రమే కాకుండా పుష్ప 2 కి వచ్చే లాభాల్లోనూ సుకుమార్ వాటాదారుగా ఉన్నారు. దీనితో అదొక ప్లస్ అని చెప్పాలి.

ఈ ఒక్క సినిమాకే 150 కోట్ల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. కాగా పుష్ప పార్ట్ 1 కి సుకుమార్ నిర్మాణంలో చేయి వెయ్యలేదు కానీ పార్ట్ 2 కి మాత్రం మైత్రి మూవీ మేకర్స్ తో కలిపి సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యారు. సో ఒకవేళ లాభాలు వస్తే అది తనకి మరింత ప్రాఫిట్స్ అని చెప్పాలి. మొత్తానికి మాత్రం సుకుమార్ పుష్ప 2 కోసం ఊహించని మొత్తాన్నే పారితోషకం తీసుకుంటున్నారని చెప్పాలి.
ఇక ఈ బిగ్గెస్ట్ సీక్వెల్‌కి సుకుమార్ పార్ట్ 3 ని కూడా ప్లాన్ చేస్తుండగా ఇది కొంచెం ఆలస్యంగా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పుష్ప 2లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించగా యంగ్ బ్యూటీ శ్రీలీల స్పెషల్ సాంగ్ చేసింది. అలాగే దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఈ డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా ఏ ఇండియన్ సినిమా రిలీజ్ కానీ విధంగా అత్యధిక స్క్రీన్స్ లో విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











