Pushpa 2: టైటిల్ విషయంలో సుకుమార్ సరికొత్త ఆలోచన.. మార్చక తప్పట్లేదు!
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప కోసం కోసం అభిమానులు ఏ స్థాయిలో వేయిట్ చేస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినిమాకు సంబంధించిన చిన్న న్యూస్ లీక్ అయినా కూడా దాని గురించే చర్చించుకుంటున్నారు. ఇక టైటిల్ విషయంలో దర్శకుడు సుకుమార్ మరొక విధంగా ఆలోచిస్తున్నట్లు పక్కా సమాచారం అందుతోంది.

అల్లు అర్జున్ లైన్ లోకి రావడంతో
సుకుమార్ తన కెరీర్ లో రంగస్థలం సినిమాతో తనను తాను కొత్తగా ప్రజెంట్ చేసుకొని బాక్సాఫీస్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా అనంతరం మహేష్ బాబుతో అనుకున్నప్పటికి సెట్టవ్వలేదు. అల్లు అర్జున్ లైన్ లోకి రావడంతో ప్లాన్ మొత్తం మారిపోయింది. ఏకంగా పాన్ ఇండియా అనడంతో అందరూ షాక్ అయ్యారు.

పూర్తి మద్దతు దక్కడంతో
నిజానికి సుకుమార్ మొదట కథ రాసుకున్నప్పుడు పాన్ ఇండియా అని అనుకోలేదట. కానీ అల్లు అర్జున్ ఆలోచనలతో కథపై మరింత పదును పెట్టిన సుక్కు సినిమాను నేషనల్ వైడ్ గా తెరకెక్కించాలని డిసైడ్ అయ్యాడు. మైత్రి మూవీ మేకర్స్ నుంచి పూర్తి మద్దతు దక్కడంతో సుక్కు అంతకు మించి అనేలా రెడీ చేస్తున్నాడు.

బాహుబలి, KGF ఫార్మాట్ లోనే
ఇక సినిమా షూటింగ్ మొదలైన తరువాత ఎప్పుడు కూడా రెండు భాగాలుగా తెరకెక్కించాలని అనుకోలేదు. ఇటీవల సినిమా లెన్త్ చాలా ఎక్కువవుతోందని అనవసరంగా ఎడిట్ లో లేపేయ్యడం ఎందుకని రెండు భాగాలుగా ప్లాన్ సెట్ చేశారు బాహుబలి, KGF ఫార్మాట్ లోనే సినిమాకు హైప్ క్రియేట్ చేయాలని డిసైడ్ అయ్యారు.
Recommended Video

మరొక టైటిల్..
అయితే రెగ్యులర్ గా కాకుండా సుకుమార్ టైటిల్ విషయంలో పుష్ప 1 , పుష్ప 2 అన్నట్లు ఉండకూడదని కాస్త విభిన్నంగా ఆలోచిస్తున్నాడట. పుష్ప టైటిల్ ను యధావిధిగా ఉంచి సెకండ్ పార్ట్ కు మాత్రం మరొక హై వోల్టేజ్ టైటిల్ ను సెట్ చేయాలని అనుకుంటున్నాడట. ఇప్పటికే అల్లు అర్జున్ తో కూడా మాట్లాడినట్లు సమాచారం. మరి ఆ సెకండ్ టైటిల్ అభిమానులను ఎంతవరకు ఎట్రాక్ట్ చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











