పుష్పకి బాహుబలి స్ట్రాటజీ, గట్టిగా ప్లాన్ చేస్తున్న సుకుమార్.. కానీ అదే టెన్షన్ !

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ కెరీర్ లో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయగా అనేక సంచలన రికార్డులు కూడా సాధించింది. ఈ సినిమా టీజర్ లో ఈ సినిమా ఎలా ఉండబోతుందో ఒక క్లారిటీ ఇచ్చేశాడు సుకుమార్.. రా అండ్ రస్టిక్ లో ఉన్న అల్లు అర్జున్ టీజర్ మొత్తాన్ని తనదైన ప్రతిభతో ఆకట్టుకున్నాడు.. అయితే ఈ సినిమాకు బాహుబలి స్ట్రాటజీ ఫాలో అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

బొడ్డు చూపిస్తూ సెగలు రేపిన పాయల్ రాజ్‌పుత్.. మరో రేంజ్‌లో సెక్స్ అప్పీల్

రెండు భాగాలుగా

రెండు భాగాలుగా

నిజానికి గతంలో పుష్ప రెండు భాగాలుగా విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. సుకుమార్ రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం సినిమా మూడు గంటలు దాటి పోయింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది ? అనే యోచన చేస్తున్నట్లుగా మళ్ళీ ప్రచారం జరుగుతోంది. సుకుమార్ ప్రస్తుతానికి అదే పనిలో ఉన్నాడు అని అంటున్నారు. అయితే రెండు భాగాలుగా తెరకెక్కించిన అన్ని సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి అని చెప్పలేము. అందుకే ఈ అంశం మీద సుకుమార్ ఎక్కువ హోం వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

 అన్నీ వర్కౌట్ కాలేదు

అన్నీ వర్కౌట్ కాలేదు

అయితే రెండో భాగం రిలీజ్ చేయాలని భావించడం పెద్ద రిస్క్ అని చెబుతున్నారు. రెండో భాగం కోసం ఆడియన్స్ విపరీతంగా వెయిట్ చేస్తే తప్ప రెండో భాగం హిట్ అయ్యే అవకాశాలు ఉండవని చెబుతున్నారు. మొదటి భాగం సూపర్ హిట్ గా నిలిచి అది రెండో భాగం మీద ఆసక్తి రేకెత్తించే విధంగా ఉంటే తప్ప వర్కౌట్ కాదని విశ్లేషకులు చెబుతున్నారు.. ఈ నేపథ్యంలోనే అలా మొదటి భాగాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్ది రెండో భాగం మీద ఆసక్తి రేకెత్తించే విధంగా మొదటి భాగాన్ని ఎండ్ చేయాలని భావిస్తున్నారు

 కట్టప్ప లాంటి కాన్సెప్ట్

కట్టప్ప లాంటి కాన్సెప్ట్

నిజానికి బాహుబలి సిరీస్ లో మొదటి భాగంలో రాజమౌళి అదే చేశాడు. మొదటి భాగం చివరలో కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు అనే ప్రశ్న రేకెత్తించి సినిమా రిలీజ్ అయ్యేదాకా దాన్ని ఎక్కడా బయటకు లీక్ కాకుండా చూసుకుంటూ రెండో భాగం మీద ఆసక్తి రేకెత్తించాడు. ఒక రకంగా జాతీయ మీడియా మొదలు ప్రధానమంత్రి మోడీ సైతం బాహుబలి కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్నను వాడారు అంటే ఈ సినిమా జనాల మీద ఎంత ఇంపాక్ట్ చూపిందో అర్థం చేసుకోవచ్చు. అదే రేంజ్లో సుకుమార్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

చెప్పిన డేట్ కే వస్తారా ?

చెప్పిన డేట్ కే వస్తారా ?

నిజానికి ముందుగా ప్రకటించిన అధికారిక ప్రకటన మేరకు పుష్ప సినిమా ఆగస్టు 13న రిలీజ్ కావాల్సి ఉంది.. ఈ లోపు సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయాలా లేక సింగిల్ గా రిలీజ్ చేయాలా అనేది ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. నిజానికి ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివార్లలో జరుగుతోంది. అల్లు అర్జున్ మినహా మిగతా యూనిట్లో వాళ్ళు సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. సునీల్ - అనసూయ మధ్య కొన్ని కాంబినేషన్ సీన్స్ షూట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.


Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X