Pushpa 2: అల్లు అర్జున్ మూవీలో హాలీవుడ్ సీక్వెన్స్..సుకుమార్ డమ్మీ ప్లాన్ గురించి తెలిస్తే!
గతంలో కంటే ఇప్పుడు తెలుగు సినిమా స్థాయి భారీ స్థాయిలో పెరిగిపోయింది. దీనికి కొన్ని సినిమాలు కారణం అయ్యాయి. అందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప ది రైజ్' మూవీ ఒకటి. అంతలా ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో సక్సెస్‌ను సొంతం చేసుకుంది. కలెక్షన్ల పరంగానూ ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది.
'పుష్ప ది రైజ్' సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా 'పుష్ప ది రూల్' మూవీని తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్‌ను చిత్ర యూనిట్ ఎంతో జోష్‌తో జరుపుతోంది. ఇలా ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా వరకూ టాకీ పార్టును కూడా కంప్లీట్ చేసుకున్నారు. మిగిలిన భాగాన్ని కూడా త్వరగా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

పాన్ ఇండియాను షేక్ చేసిన 'పుష్ప ది రూల్' మూవీపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన గ్లింప్స్ వీడియోకు, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ కూడా వచ్చింది. దీనికితోడు ఈ చిత్రం నుంచి తరచూ ఏదో ఒక వార్త బయటకు వస్తూనే ఉంటోంది.
ఓ మామూలు కూలీ అయిన పుష్ప రాజ్ ఎర్ర చందనం స్మగ్లింగ్‌లో డాన్‌గా ఎలా మారాడు అనే పాయింట్‌తో 'పుష్ప ద రూల్' రూపొందుతోంది. ఇందులో ఫస్ట్ పార్ట్ కంటే అన్నీ హై రేంజ్‌లోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ఓ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుందట. దీన్ని హాలీవుడ్ రేంజ్‌లో భారీ స్థాయిలో తెరకెక్కించబోతున్నట్లు తెలిసింది.

'పుష్ప ది రైజ్' మూవీలో వచ్చే ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం 15 రోజుల పాటు షూట్ చేయాల్సి ఉంటుందని తెలిసింది. ఇందులో ప్రధాన నటీనటులు అందరూ ఉంటారట. అందుకే ముందుగా ఈ ఫైట్‌ను డమ్మీ ఆర్టిస్టులను పెట్టి సుకుమార్ షూట్ చేస్తున్నాడట. అంతా పర్‌ఫెక్ట్‌గా వచ్చిన తర్వాత అందరితో అసలైన షూట్ చేస్తాడని తెలిసింది. దీంతో దర్శకుడు చేస్తున్న ఈ డమ్మీ ప్రయోగం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది.
ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్ - సుకుమార్ కలిసి చేస్తున్న 'పుష్ప ద రూల్' సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా చేస్తోండగా.. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా నటిస్తున్నాడు. సునీల్, అనసూయ కీలక పాత్రలు చేస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్‌ను కంపోజ్ చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











