అల్లు అరవింద్ చేతిలో ‘జోకర్’గా మారనున్న పవన్ కళ్యాణ్..!
విభిన్నమైన కథా చిత్రాలతో ఆకట్టుకుంటున్న యువ దర్శకుడు సుకుమార్..ఈ దర్శకుడు ఈ మధ్య నాగచైతన్య, తమన్నా జంటగా '100% లవ్" అనే చిత్రాన్ని రూపొందించి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే..ఈ చిత్రంతో పవన్ దృష్టిలో పడ్డ సుకుమార్ ఏకంగా పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు..వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించడానికి రెడీ అవుతున్నాడు..ఐతే ఇప్పటి వరకు డిగ్నిఫైడ్ గా వున్న పవన్ కళ్యాణ్ ని ఈ చిత్రంతో అల్లు అరవింద్, సుకుమార్ లు 'జోకర్"ని చేయబోతున్నారట...
అల్లు అర్జున్ కోసం సుకుమార్ సిద్దం చేసిన స్టోరీని పవన్ ఒకే చేయబోతున్నాడని ఫిలింనగర్ సమాచారం..ఓ డిఫరెంట్ చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రానికి 'జోకర్" అనే టైటిల్ ని సుకుమార్ ఖరారు చేసేశాడట..ప్రస్తుతం 'షాడో", 'గబ్బర్ సింగ్" అలాగే సింగీతం శ్రీనివాసరావు రూపొందిస్తున్న 'ట్రాఫిక్ జామ్" చిత్రాల్లో నటిస్తున్న పవన్ కళ్యాణ్ ఈ చిత్రాల తర్వాత సుకుమార్ చేతిలో 'జోకర్" కాబోతున్నాడట..ప్రయోగాల జోలికి వెళ్ళనంటూనే ప్రయోగాలు చేస్తున్న పవన్ మరి జోకర్ గా ఎలాంటి ప్రయోగాలకు తెరతీస్తాడో వేచి చూడాల్సిందే...


Click it and Unblock the Notifications











