సుమ దంపతుల న్యూ స్టెప్.. అత్యంత విలాసవంతంగా! టాలీవుడ్‌లో హాట్ టాపిక్..

టాలీవుడ్ చిత్రసీమలో యాంకర్ సుమకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. యాంకర్‌గా తనదైన పంచ్ డైలాగులతో అందరినీ బుట్టలో వేసుకోవడం సుమకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే ఏ సినిమా ఫంక్షన్ కోసమైనా గానీ, ఏ టీవీ ప్రోగ్రాం కోసమైనా గానీ ముందుగా సుమనే సంప్రదించడం ఆనవాయితీగా వస్తోంది. అలాంటి సుమ, తన భర్త రాజీవ్ కనకాలతో కలిసి కొత్త స్టెప్ వేసిందని తెలుస్తోంది. వివరాల్లోకి పోతే..

Recommended Video

Anchor Suma And Rajiv Kanakala Purchases New House | Filmibeat Telugu
అందరిదీ అదే బాట.. సుమ ప్లాన్

అందరిదీ అదే బాట.. సుమ ప్లాన్

ప్రస్తుతం చిత్రసీమలో ఎక్కువ మంది నటీనటులు తమ తమ సొంతిల్లు కొనుక్కునేందుకు, దాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ధేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇటీవలే క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న ఇల్లు కొనేయగా, అల్లు అర్జున్ కొత్త ఇల్లు నిర్మాణ పనుల్లో ఉన్నారు. ఇదే బాటలో యాంకర్ సుమ దంపతులు కూడా ఉన్నారు.

ఖరీదైన భవనం.. జనం టాక్

ఖరీదైన భవనం.. జనం టాక్

సుమ కనకాల దంపతులు ఇప్పటికే ఓ ఖరీదైన ఇల్లు కొనుగోలు చేశారనే వార్త సోషల్ మీడియాలో హాట్ ఇష్యూగా మారింది. అత్యంత విలాసవంతంగా ఉండే ఈ ఇంటి కోసం కొన్ని కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. తమకు నచ్చినట్లు వాస్తు ప్రకారం అన్నీ చూసుకుని భారీగా ఈ ఇంటిని తీసుకున్నారని, త్వరలోనే గృహప్రవేశం కూడా చేయనున్నారని టాక్ నడుస్తోంది.

గృహ ప్రవేశం.. చర్చల్లో సుమ ఫ్యామిలీ

గృహ ప్రవేశం.. చర్చల్లో సుమ ఫ్యామిలీ

నిజానికి సుమ దంపతులు ఈ ఇల్లు తీసుకొని చాలా రోజులైందని, రాజీవ్ కనకాల ఫాదర్ దేవదాస్ కనకాల మరణం కారణంగా ఇన్నాళ్లు గృహప్రవేశం చేయలేదని సుమ సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు ఇప్పుడు ఈ ఇంటి గృహ ప్రవేశం గురించి సుమ ఇంట్లో చర్చలు నడుస్తున్నాయని సమాచారం.

త్వరలోనే శుభకార్యం.. అభిమానుల్లో సంబరాలు

త్వరలోనే శుభకార్యం.. అభిమానుల్లో సంబరాలు

దీంతో ఇటీవలి కాలంలో సుమ, రాజీవ్ కనకాల దంపతుల మధ్య సఖ్యత లేదని వస్తున్న వార్తలకు ఫుల్‌స్టాప్ పడ్డట్లయింది. సుమ, రాజీవ్ కనకాల దంపతులు త్వరలోనే ఆ విలాసవంతమైన భవనంలోకి గృహ ప్రవేశం చేయనున్నారని తెలుస్తుండటం సుమ అభిమానుల్లో సంబరాలు నింపుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X