Valtheru Veeraiah: చిరంజీవి, రవితేజను కలిపిన లేడీ ఎంపీ.. అసలైందే లీక్ చేశారుగా!
సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత జెట్ స్పీడుతో దూసుకుపోతోన్నారు మెగాస్టార్ చిరంజీవి. సుదీర్ఘ విరామం తర్వాత 'ఖైదీ నెంబర్ 150' అనే సినిమా చేసిన ఆయన.. దీని తర్వాత నుంచి వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇలా ఇప్పుడు ఏకంగా మూడు నాలుగు సినిమాలను పట్టాలెక్కించారు. అందులో కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వంలో నటిస్తోన్న సినిమా ఒకటి. ఇందులో మాస్ మహారాజా రవితేజ కూడా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇందులో మరో ముఖ్యమైన పాత్రలో సీనియర్ హీరోయిన్ నటిస్తున్నట్లు ఓ న్యూస్ లీకైంది. అంతేకాదు, ఓ మెయిన్ పాయింట్ కూడా బయటకు వచ్చింది. ఆ వివరాలేంటో మీరే చూడండి!

ఆచార్యతో చిరంజీవికి భారీ దెబ్బ
రీఎంట్రీలో ఫుల్ జోష్‌లో ఉన్న చిరంజీవి ఇటీవలే 'ఆచార్య' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఇందులో రామ్ చరణ్ కూడా నటించాడు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు నిర్మించాయి. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా నిరాశ పరిచింది. ఫలితంగా దీనికి రూ. 80 కోట్లకు పైగా నష్టాలు మిగిలాయి.

రెండు సినిమాలు ముందుగానే
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్‌ను 'గాడ్ ఫాదర్' టైటిల్‌తో రీమేక్ చేస్తున్నారు. దీన్ని మోహన్ రాజా తెరకెక్కిస్తున్నాడు. దీని అనంతరం మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళంలో బంపర్ హిట్ అయిన వేదాళం చిత్రాన్ని 'భోళా శంకర్'గా రీమేక్ చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలకు సంబంధించిన షూటింగ్‌లను ముందుగానే పూర్తి చేస్తున్నారు.

బాబీతో వాల్తేరు వీరయ్య మూవీ
వరుస విజయాలతో దూసుకెళ్తోన్న టాలెంటెడ్ డైరెక్టర్ కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీతోనూ మెగాస్టార్ చిరంజీవి సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసుకున్న సంగతి విధితమే.

వాల్తేరు వీరయ్య కోసం రవితేజ
క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'వాల్తేరు వీరయ్య' మల్టీస్టారర్ జోనర్‌లో తెరకెక్కబోతున్నట్లు దర్శకుడు బాబీ ఎప్పుడో ప్రకటించాడు. దీంతో ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే హీరో ఎవరన్న దానిపై ఎన్నో రకాల చర్చలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఆ పాత్రలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్నట్లు చాలా రోజుల క్రితమే ఓ న్యూస్ వచ్చింది.

ఎంటరైన రవితేజ.. షూట్ షురూ
'వాల్తేరు వీరయ్య' మూవీలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవలే అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు, అతడికి సంబంధించిన ఓ వీడియోను కూడా వదిలింది. ఇందులో రవితేజ షూటింగ్‌లో పాల్గొన్నట్లు చూపించారు. అంతేకాదు, అతడితో కలిసి చిరంజీవి అదిరిపోయే సాంగ్‌ను చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగిపోయింది.

రవితేజ తల్లిగా ఎంపీ కమ్ నటి
భారీ మల్టీస్టారర్‌గా రూపొందుతోన్న 'వాల్తేరు వీరయ్య' మూవీలో మెగాస్టార్ చిరంజీవి, రవితేజతో పాటు మరికొందరు స్టార్లు కీలక పాత్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇందులో ఒకప్పటి స్టార్ హీరోయిన్, ప్రస్తుతం పార్లమెంట్ సభ్యురాలు సుమలత కీలక పాత్రను చేస్తున్నట్లు ఓ న్యూస్ లీకైంది. ఆమె రోల్ సినిమాను మలుపు తిప్పే విధంగా ఉండబోతుందని అంటున్నారు.

మెయిన్ పాయింట్ బయటకు
ఇద్దరు బడా హీరోల కలయికలో రూపొందుతోన్న 'వాల్తేరు వీరయ్య' మూవీలో సుమలత.. రవితేజకు తల్లిగా నటిస్తున్నట్లు కూడా ఓ వార్త తాజాగా బయటకు వచ్చింది. అంతేకాదు, ఆమె పాత్ర కారణంగానే చిరంజీవిని రవితేజ రోల్ కలుస్తుందని తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ అంతా ఎంతో ఎమోషనల్‌గా సాగనుందని అంటున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.


Click it and Unblock the Notifications











