తండ్రి రామోజీరావుతో విభేదించి మొన్న సాక్షి పేపర్ లో సైతం విరుచుకు పడ్డ సుమన్ తన సోల్ మేట్ ప్రభాకర్ తో కలిసి ఓ ఛానెల్ పెట్టబోతున్నారనే వార్తలు వినపడుతున్నవే. అయితే ఇప్పుడా ఛానెల్ పేరు ఎస్ ఛానెల్ అనీ,టాగ్ లైన్ గా సుమధుర వాణి అని పెడుతున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ఫినిష్ చేసిన ఈ ఛానెల్ కి సుమన్ కి పరిచయమున్న కొందరు కాంట్రాక్టర్స్ పెట్టుబడి పెడుతున్నారని సమాచారం. ఇక ఈ టీవీలో ఆగిపోయిన టీవీ సీరియల్స్ ఈ సరికొత్త ఛానెల్ లో చోటు చేసుకుంటాయని తెలుస్తోంది.పూర్తి స్ధాయి ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ గా దీన్ని రూపొందించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆంధ్రాలో నెంబర్ వన్ ఛానెల్ గా దీన్ని తయారు చేసి తండ్రికి తన ప్రతిభా పాటవాలు చూపాలని సుమన్ తలపోస్తున్నట్లు సమాచారం.