అక్కినేనిని దేవదాసుగా మరిచిపోవటం కష్టమే. అయితే ఇప్పుడాయన మనవడు సుమంత్ దేవదాసుగా కనిపించనున్నారు. అయితే దేవదాసు సినిమా మళ్ళి రీమేక్ చేయటం లేదు. ఆయన తాజాగా చేస్తున్న బోణి చిత్రంలో అతని పేరు దేవదాసు. అందరూ అతన్ని డి.డి.అని పిలుస్తారంటున్నారని తెలుస్తోంది. అయితే ఇది దేవదాసు మోడ్రనైజ్ చేస్తూ వచ్చిన దేవ్ డి చిత్రాన్ని గుర్తు చేసినా కథ అది కాదంటున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా క్రుతి హీరోయిన్ గా పరిచయమవుతోంది. దర్శకుడుగా రాజ్ పిప్పళ్ళ సైతం పరిచయమవుతున్న చిత్రం ఇది. నిర్మాతగా సంగీత దర్సకుడు రమణగోగుల సైతం ఈ చిత్రంతో నిర్మాత అవతారమెత్తుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే దేవ్ డి చిత్రాన్ని రీమేక్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనను ఆయన ముందు కొందరు దర్శకులు పెట్టారని సమాచారం. అభయ్ డియోల్ హీరోగా చేసిన ఈ సినిమా హిందిలో సంచలనమైంది.
Story first published: Thursday, May 21, 2009, 12:19 [IST]