యువ హీరో సుమంత్ అశ్విన్ పెళ్లి.. సీక్రెట్‌గా వివాహానికి ఏర్పాట్లు!.. పెళ్లి కూతురు ఎవరంటే?

2020 ఎవరికి ఎలా ఉన్నా.. ఎంత మంది ఎన్ని బాధలు పడ్డా కూడా కొందరు సెలెబ్రిటీల జీవితాల్లో మాత్రం మరిచిపోని ఏడాదిగా మిగిలింది. ఎంతో మంది టాలీవుడ్ కుర్ర హీరోలు ఓ ఇంటి వారయ్యారు. తాము ప్రేమించిన అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారు. అలా 2020లో నిఖిల్ పల్లవి, నితిన్ షాలిని, రానా మిహీకాల వివాహాలు ఎంతో ఘనంగా జరిగాయి. 2020 మొత్తం పెళ్లి సందడిగా మారిపోయింది.

 2020లో అంతా సందడి..

2020లో అంతా సందడి..

2020 మొత్తం కరోనా వల్ల చిందరవందరగా మారింది. అయితే అందులోనూ కొన్ని మంచి విషయాలు జరిగాయి. కరోనా అనే దాన్ని ఎవ్వరూ ఊహించ లేదు. అందుకే ఎంతో గ్రాండ్‌గా ఊహించుకున్న పెళ్లిళ్లను చాలా సింపుల్‌గా చేసుకున్నారు. అందులోనూ సెలెబ్రిటీలు తమ తమ రేంజ్‌కు తగ్గట్టే చేసుకున్నారు. అన్నింటి కంటే ఎక్కువగా మెగా ఫ్యామిలీలో జరిగిన నిహారిక పెళ్లి బాగా వైరల్ అయింది.

 ఈ ఏడాదిలో అలా..

ఈ ఏడాదిలో అలా..

2020లో పెళ్లిళ్లు బాగానే జరిగాయి. 2021 ప్రారంభంలోనూ సింగర్ సునీత రెండో వివాహాన్ని చేసుకుంది. ఇక ఇప్పుడు మరో సెలెబ్రిటీ, కుర్ర హీరో కూడా పెళ్లి పీఠలెక్కబోతోన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు వార్తలు వైరల్ అవుతున్నాయి. యంగ్ హీరో సుమంత్ అశ్విన్ త్వరలోనే వివాహాం చేసుకోబోతోన్నట్టు టాక్ బయటకు వచ్చింది.

పెళ్లి సందడి..

పెళ్లి సందడి..

నిర్మాత ఎమ్‌ఎస్‌ రాజు ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఆయన తనయుడు, హీరో సుమంత్‌ అశ్విన్‌ తొందర్లోనే ఓ ఇంటివాడు కాబోతున్నట్లు టాక్. దీపిక అనే అమ్మాయితో ఫిబ్రవరి 13న వివాహం జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 అధికారిక ప్రకటన..

అధికారిక ప్రకటన..

అయితే ఈ పెళ్లి గురించి ప్రకటన మాత్రం ఇంత వరకు బయటకు రాలేదు. ఇంకో వారం సమయం ఉంది కాబట్టి మీడియాకు బహిరంగంగానే చెప్పి వివాహాన్ని గ్రాండ్‌గా చేసుకుంటారో లేదో చూడాలి. మొత్తానికి ఇదే నిజమైతే ఈ ఏడాదిలో పెళ్లి చేసుకోబోతోన్న మొదటి హీరో సుమంత్ అవుతాడు.

Recommended Video

Prabhas 21 : Nag Ashwin Repeats Mahanati Crew | Deepika Padukone | Prabhas
కెరీర్ అలా..

కెరీర్ అలా..

'తూనీగ తూనీగ' సినిమా ద్వారా వెండితెరపై అడుగు పెట్టిన సుమంత్.. ఇప్పటి వరకు ఓ బ్లాక్ బస్టర్ హిట్‌ను కొట్టలేకపోయాడు. మధ్యలో కేరింత, అంతకు ముందు ఆ తరువాత వంటి కూల్ హిట్‌లు కొట్టాడు. ప్రస్తుతం 'ఇదే మా కథ'తో మరోసారి తన లక్‌ను పరీక్షించుకునేందుకు వస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X