twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మారుతి దర్శకత్వంలో మరో నిర్మాత కుమారుడు

    By Srikanya
    |

    హైదరాబాద్ : అల్లు అరవింద్ కుమారుడు అల్లు శిరీష్ ని ప్రస్తుతం మారుతి డైరక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ లోగా ఈ సక్సెస్ ఫుల్ దర్శకుడుకి మరో నిర్మాత కుమారుడుని డైరక్ట్ చేయటానికి ఆఫర్ వచ్చింది. ప్రముఖ నిర్మాత ఎమ్.ఎస్ రాజు కుమారుడు సుమంత్ అశ్విన్ తో ఈ సారి చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రాన్ని మహేంద్ర, సత్యనారాయరెడ్డి కలిసి నిర్మించనున్నారు. ఈ నెల 17న ఓపినింగ్ కానుంది.

    ప్రస్తుతం సుమంత్ అశ్విన్ హీరోగా శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై కె.ఎల్. దామోదర్ ప్రసాద్ 'అంతకు ముందు... ఆ తరువాత' అనే చిత్రం నిర్మించి విడుదలకు సిద్దం చేసారు. ఈ చిత్రం కాన్సెప్టు టైటిల్ ని జస్టిఫై చేస్తుందని, నవతరం ఆలోచనలకు దగ్గరగా ఉంటుందని చెప్తున్నారు. ఈ విషయమై మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ.... ప్రేమలో గెలవడం ఒక ఎత్తయితే... ఆ ప్రేమను నిలబెట్టుకోవడం మరో ఎత్తు. జీవితాంతం తోడుగా ఉంటాననే భరోసాని ఎదుటి వ్యక్తిలో కల్పించినప్పుడే అది నిలబడుతుంది. నవతరం ఆ విషయంలో ఏ మేరకు విజయం సాధిస్తున్నారు? వారిలో ఉన్న చిన్నపాటి గందరగోళానికి కారణమేమిటి? ఓ జంట ప్రేమలో పడటానికి ముందు ఎలా ఉంటుంది?, ఆ తర్వాత ఎలా మారిపోతుంటుంది? అనే విషయాల్ని మా చిత్రంలో చూడాల్సిందే అంటున్నారు.

    నిర్మాత మాట్లాడుతూ ''జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడంలో యువతరం ఆలోచనలు ఏ రీతిన ఉంటున్నాయో వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నమే ఈ చిత్రం. భావోద్వేగాలకు ప్రాధాన్యమున్న ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుంది. వచ్చే నెలలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు. ఈ చిత్రం షూటింగ్ చివరిదశకు చేరుకొంది. రవిబాబు, రావు రమేష్‌, అవసరాల శ్రీనివాస్‌, రోహిణి, మధుబాల, తాగుబోతు రమేష్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: పి.జి.విందా, కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, కళ: ఎస్‌.రవీందర్‌, సంగీతం: కల్యాణి కోడూరి, సహ నిర్మాతలు: వివేక్ కూచిభొట్ల, జగన్మోహన్‌రెడ్డి వి., కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.

    English summary
    
 Successful director Maruthi may soon direct MS.Raju's son Sumanth Aswin.Sumanth made his debut with ‘Tuneega Tuneega’ and is currently starring in ‘Antaku Mundu Aa Tarvata’. This being produced by Mahendra, satyanarayana Reddy who are close associates of Bellamkonda Suresh and China Babu who is partner of DVV Danayya. This is expected to launch on 17th of this month.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X