ఆ హీరోయిన్‌తో హీరో సుమంత్ రెండో పెళ్లి?
ఆ తర్వాత నుంచి సుమంత్ హీరోయిన్లతో ఎఫైర్లు పెట్టుకున్నట్లు ఇండస్ట్రీలో రూమర్లు షికారు చేయడం కామన్ అయిపోయింది. అయితే సుమంత్ ఇలా ఒంటరిగా జీవితస్తూ, జీవితంపై బాధ్యత లేకుండా ఉండటాన్ని కుటుంబ సభ్యులు మాత్రం జీర్ణించుకోలేక పోతున్నారట. ఈ నేపథ్యంలో సుమంత్ మామయ్య నాగార్జున ఈ విషయమై క్లాస్ పీకినట్లు ఫిల్మ్ నగర్ టాక్.
ఇంకా ఎంత కాలం ఇలా మోడు బారిన జీవితం గడుపుతావు? జీవితంలో నీకంటూ ఓ తోడూ, నీడా అవసరం లేదా? ఇలా అయితే ఓ వయసు వచ్చాక చాలా బాధ పడతావు, ఆ పరిస్థితి రాక ముందే తేరుకో...అంటూ లెక్చర్ ఇచ్చినట్లు సమాచారం. మామయ్య ఇచ్చిన క్లాస్‌తో బాధ్యత గ్రహించిన సుమంత్ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
సుమంత్ లో సడన్ చేంజ్ ను చూసి ఇంటిల్లి పాది ఆనందంగా ఉన్నారట. సుమంత్ మనస్తత్వానికి, తమ కుటుంబ వాతావరణానికి సెట్ అయ్యే అమ్మాయి కోసం వెతుకులాట ప్రారంభించారని తెలుస్తోంది. సుమంత్ సోదరి సుప్రియ ఈ విషయాన్ని దగ్గరుండి పరిశీలిస్తుందట.
మరో వైపు తనతో పాటు 'గోదావరి' చిత్రంలో కలిసి నటించిన హీరోయిన్ కమలినీ ముఖర్జీపై సుమంత్ మనసు పారేసుకున్నాడని, ఇద్దరి మనసులు కలిసాయని, వీరిద్దరు పెళ్లి చేసుకునే అవకాశం ఉందనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి. గతంలోనూ వీరిద్దరిపై ఇలాంటి వార్తలు వినిపించాయి. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications












