యంగ్ హీరో చేతులారా కాల్చుకున్నదే!

అయితే అప్పుడు ఆగిపోయిన ఆ చిత్రాన్ని నట్టికుమార్ కొనుగోలు చేసి ఇప్పుడు పేరు మార్చి రిలీజ్ చేస్తున్నాడు. శాటిలైట్ రైట్స్ కోసమో మరి దేనికో గానీ ఆయన ప్రయత్నం గానీ...ఇది సుమంత్ కి మరో దెబ్బ అంటున్నారు విశ్లేషకులు.అంతేగాక ఆ ప్రొమోలు,పోస్టర్స్ చూసిన వారు సుమంత్ కి సినిమాలు లేకే కదా ఈ ఖర్మ పట్టింది నవ్వుకుంటున్నారు. ఇక అప్పట్లో ఉదయ్ కిరణ్ కీ ఇట్లానే కెరీర్ ప్రారంభం రోజుల్లో చేసిన జోడి నెంబర్ వన్ చిత్రం తర్వాత రిలీజ్ అయ్యి అందరి చేతా ఛీత్కారం కొట్టించుకుంది. అలాగే ఇప్పుడు ఈ సినిమాకీ అదే గతి పడుతుంది అంటున్నారు.
అదే సుమంత్ తనే ముందుకు వచ్చి ఎంతో కొంత ఇచ్చి సెటిల్ చేసుకుని రైట్స్ తనదగ్గరే ఉంచేసుకుంటే ఈ భాధ ఉండకపోను అని అంటున్నారు. అయినా సుమంత్ కూడా నవీన్ లా పూర్తి స్ధాయిలో ఫేడ్ అవుట్ అవుతున్నాడనే టాక్ అంతటా వ్యాపిస్తోంది. అదీ కూడా స్వయం కృతం అనే అంటున్నారు. ఎవరైనా డైరక్టర్ కథ పట్టుకని వెళితే వాళ్ళకి నువ్వెక్కడ చేసావు...నీ బ్యాక్ గ్రౌండ్ వంటి శల్య పరీక్షలు చేసి అసలు విననే వినరని...ఫలానా పెద్ద వారి దగ్గరే చేసానంటే ఒప్పుకుంటాడనీ...ఈ మధ్యే సూపర్ హిట్ కొట్టిన ఓ కొత్త దర్శకుడు తన వారి దగ్గర నవ్వుతూ వెటకారం చేస్తూ చెప్పటం జరిగింది. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











