హీరో సునీల్ సినిమా బాలీవుడ్‌లో..
హీరో సునీల్ నటించిన పూల రంగడు చిత్రం ఇక్కడ మంచి విజయం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. వీరభద్రం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై అచ్చిరెడ్డి నిర్మించారు. ఇషా చావ్లా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ అంగీతం అందించారు.
తాజాగా సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం పూల రంగడు చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడాలనే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది. హిందీ రీమేక్ లో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించనున్నట్లు సమాచారం. బాలీవుడ్ లోని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ 'బాబా ఫిల్మ్స్' ఈ చిత్రం హక్కులను సొంతం చేసుకుంది. ఇటీవలే ఆ సంస్థ ప్రతినిధులు నిర్మాత అచ్చిరెడ్డిని కలిసి డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం.
మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా 'వాంటెడ్'గా రీమేక్ అయి భారీ విజయం సాధించింది. ఈ క్రమంలో తెలుగు సూపర్ హిట్ సినిమాలపై బాలీవుడ్ బాబులు ఓ ఒకన్నేసి ఉంచారు. ఇప్పటికే చాలా తెలుగు సినిమాలు హిందీలో రీమేక్ అయి భారీ విజయసాలు సాధించాయి. తాజాగా వారి కన్ను సునీల్ సినిమాపై పడ్డాయి.


Click it and Unblock the Notifications











