కాబోయే భర్తతో టాలీవుడ్ హీరోయిన్ బ్రేకప్? దుబాయ్ ప్రియుడితో పెళ్లి రద్దు?

చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్‌గా ఉన్న స్టార్స్ ఒక్కొక్కరిగా పెళ్లిళ్లు చేసుకుని లైఫ్‌లో సెటిల్ అవుతున్నారు. కొందరు తమ పార్ట్‌నర్స్‌తో ప్రేమ జీవితానికి ముగింపు పలికి వైవాహిక బంధంతో ఒక్కటవుతున్నారు. అయితే కొందరు సెలబ్రిటీలు మాత్రం ఊహించని విధంగా షాకిస్తున్నారు. గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకుని రేపో మాపో పెళ్లి అనగా బ్రేకప్ చెప్పుకుంటున్నారు. టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి అలాగే పీటల మీదే ఆగిపోయింది. సంగీత్, మెహందీ ఫంక్షన్‌లు చేసుకుని కొద్దిగంటల్లో పెళ్లి అనగా వారి పెళ్లి అర్ధాంతరంగా నిలిచిపోయింది..

ఇలాంటి ఘటనలు అనేకం స్టార్ హీరోయిన్ త్రిష ఓ వ్యక్తితో ఎంగేజ్‌మెంట్ చేసుకుని త్వరలో పెళ్లి చేసుకోవాల్సి ఉండగా అనూహ్యంగా నిశ్చితార్ధాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు త్రిష. నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా విజయ్ దేవరకొండ కంటే ముందు కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో కిర్రాక్ పార్టీ సినిమా సమయంలో ప్రేమలో పడింది. పెద్దల అంగీకారంతో వీరిద్దరూ పెళ్లికి సిద్దమ్యారు, రక్షిత్- రష్మికలకు గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. కానీ ఏం జరిగిందో ఏమో కానీ వీరిద్దరూ నిశ్చితార్థం రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత రష్మిక కన్నడ ఇండస్ట్రీకి దూరమై తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టడం.. విజయ్ దేవరకొండతో ప్రేమలో పడి తాజాగా పెళ్లి చేసుకోవడం తెలిసిందే.

Sunaina Yella and Khalid Al Ameri Breakup Rumours Go Viral

ఇక ఇటీవల తమిళ నటి నివేదా పేతురాజ్ కూడా తన పెళ్లిని రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. దుబాయ్‌కి చెందిన రజత్ ఇబ్రాన్‌తో ప్రేమాయణం సాగించిన ఈ ముద్దుగుమ్మ ఆయనతో ఎంగేజ్‌మెంట్ చేసుకుని త్వరలో పెళ్లి చేసుకుంటామని అనౌన్స్ చేశారు. కానీ ఏం జరిగిందో ఏమో కానీ రజత్- నివేదాలు తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, ఇద్దరూ కలిసున్న ఫోటోలను డిలీట్ చేయడం ద్వారా తమ బంధం ముగిసిందని చెప్పి ప్రపంచానికి షాకిచ్చారు.

తాజాగా ఇదే లిస్ట్‌లోకి చేరుకున్నారు హీరోయిన్ సునైనా యెల్లా. 2005లో కుమార్ vs కుమార్ అనే తెలుగు చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టిన ఆమె అనంతరం టెన్త్ క్లాస్, సంథింగ్ స్పెషల్, పగలే వెన్నెల, మిస్సింగ్, పెళ్లికి ముందు ప్రేమకథ, రాజ రాజ చోర తదితర సినిమాలలో నటించింది. ఇక్కడ అనుకున్న స్థాయిలో బ్రేక్ రాకపోవడంతో మలయళం, కన్నడ, తమిళ భాషలలోనూ నటించింది. తమిళంలో వరుస హిట్స్‌తో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది సునయన. గతేడాది ఏడాది శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన కుబేరా చిత్రంలో కింగ్ అక్కినేని నాగార్జునకు భార్యగా హోమ్లీ లుక్‌‌లో ఆకట్టుకుంది.

అందరు హీరోయిన్ల మాదిరిగానే సునైనా వ్యక్తిగత జీవితంపై రకరకాల రూమర్స్ వచ్చాయి. ముఖ్యంగా దుబాయ్‌కి చెందిన ఫేమస్ యూట్యూబర్ ఖలీద్ అల్ అమేరీతో ఆమె ప్రేమాయణం సాగిస్తున్నట్లుగా గాసిప్స్ వచ్చాయి. ఈ పుకార్లను నిజం చేస్తూ ఓ రోజున అతనితో ఎంగేజ్‌మెంట్ చేసుకుని షాకిచ్చారు సునైనా. సునైనా చేతిలో చేయి వేసి పట్టుకున్న సెల్ఫీని సోషల్ మీడియాలో ఖలీద్ పోస్ట్ చేశాడు. అటు సునైనా కూడా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఖలీద్ కట్ చేసిన కేక్‌‌ని పంచుకున్నారు. అయితే పెళ్లి ఎప్పుడు అనేది మాత్రం ఇద్దరూ హింట్ ఇవ్వలేదు.

అయితే ఖలీద్ అల్ అమేరీకి ఆల్రెడీ పెళ్లయి భార్య, పిల్లలు ఉన్నారు. 2007లో సాల్మా మొహమ్మద్‌ను ఆయన పెళ్లాడారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు సంతానం. కొన్ని ఉద్యోగాల అనంతరం ఇన్‌ఫ్లూయెన్సర్‌గా, యూట్యూబర్‌గా మారిన ఖలీద్ యూఏఈతో పాటు భారత్‌లోనూ ఫాలోవర్స్ ఉన్నారు. దాదాపు 17 ఏళ్లపాటు సాగిన వైవాహిక బంధానికి తెరదించుతూ సాల్మాతో విడిపోయారు ఖలీద్. ఆపై సునైనాతో ప్రేమలో పడి ఆమెను పెళ్లాడాలని అనుకున్నారు.

అయితే సునైనా- ఖలీద్‌ల పెళ్లి ఆగిపోయిందని, వీరిద్దరికి బ్రేకప్ జరిగినట్లుగా సోషల్ మీడియాలో గాసిప్స్ వస్తున్నాయి. సెలబ్రిటీలు బ్రేకప్ చెప్పినా, పెళ్లి క్యాన్సిల్ అయినా, డివోర్స్ తీసుకుంటున్నా ముందు సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, ఫోటోలు డిలీట్ చేయడం చేస్తారు. అలాగే సునైనా- ఖలీద్‌లు కూడా ఒకరినొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసుకున్నట్లుగా పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోస్తూ.. సునైనాతో కలిసి దిగిన ఫోటోను ఖలీద్ డిలీట్ చేశారు. ఆ ఫోటోకి ఆ రాత్రి ఎప్పటికీ గుర్తుంటుంది.. థ్యాంక్యూ గాడ్ అని క్యాప్షన్ పెట్టడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అయితే ఖలీద్- సునైనాల బ్రేకప్‌, పెళ్లి రద్దుకు సంబంధించి వస్తున్న వార్తలపై వీరిద్దరూ అధికారికంగా స్పందించాల్సి ఉంది.

Read more about: movie news sunaina
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X