దుబాయ్ యూట్యూబర్‌తో తెలుగు హీరోయిన్ డేటింగ్? త్వరలోనే అతనికి రెండో భార్యగా?

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు హీరో హీరోయిన్లు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు. కొందరు తమ ప్రేమ జీవితానికి గుడ్ బై చెప్పేసి పెళ్లితో ఒక్కటవుతున్నారు. మరికొందరు మాత్రం సీక్రెట్‌గా డేటింగ్ చేస్తున్నారు. హోటల్స్, రెస్టారెంట్స్, పార్టీలకు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ మీడియాకు దొరికిపోతున్నారు. తాజాగా ఓ తెలుగు హీరోయిన్ తన ప్రియుడితో దొరికిపోయింది. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

సునయన.. ఈ పేరు వింటే జనానికి బిగ్‌బాస్ ఫేమ్ దీప్తి సునైన గుర్తొస్తుంది. కాకపోతే.. ఈమె కంటే ముందే ఆ పేరు పాపులర్. తెలుగులో హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇక్కడ స్టార్ హీరోయిన్‌గా ఎదిగేందుకు అవకాశాలు లేకపోవడంతో కోలీవుడ్‌, మాలీవుడ్‌కు మకాం మార్చి అక్కడ సక్సెస్ అయ్యింది. నాగపూర్‌లో స్థిరపడిన తెలుగు కుటుంబంలో జన్మించారు సునయన ఎల్లా. చదువు తర్వాత తన తల్లిదండ్రులతో హైదరాబాద్‌కు మకాం మార్చేసిన ఈ ముద్దుగుమ్మ... సినిమాలలో అవకాశాల కోసం ప్రయత్నించింది.

Sunaina Yella Khalid Al Ameri dating Rumours Viral Reports Suggest Possible Wedding Soon

2005లో కుమార్ vs కుమార్ అనే తెలుగు చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత టెన్త్ క్లాస్, సంథింగ్ స్పెషల్, పగలే వెన్నెల, మిస్సింగ్ తదితర సినిమాలలో నటించింది. ఇక్కడ అనుకున్న స్థాయిలో బ్రేక్ రాకపోవడంతో మలయళం, కన్నడ, తమిళ భాషలలోనూ నటించింది. తమిళంలో వరుస హిట్స్‌తో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది సునయన. దాదాపు 12 ఏళ్ల తర్వాత తెలుగులో పెళ్లికి ముందు ప్రేమ కథ సినిమాలో నటించింది. అనంతరం రాజ రాజ చోర సినిమాలో మెరిసింది. ఈ ఏడాది శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన కుబేరా చిత్రంలో కింగ్ అక్కినేని నాగార్జునకు భార్యగా హోమ్లీ లుక్‌‌లో ఆకట్టుకుంది. సినిమాలతో పాటు తెలుగు, తమిళ భాషలలో పలు వెబ్ సిరీస్‌లలోనూ సునయన నటించారు. కుబేరా తర్వాత కొత్తగా ఏ చిత్రానికి సునయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

సునయన వ్యక్తిగత జీవితం గురించి గతంలోనే పలు రూమర్స్ చక్కర్లు కొట్టాయి. దుబాయ్‌కి చెందిన యూట్యూబర్‌తో ఆమె డేటింగ్ చేస్తున్నారని, ఇద్దరికీ సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ కూడా జరిగిందని గాసిప్స్ వచ్చాయి. చేతికి ఉంగరంతో ఉన్న ఫోటోలు వైరల్ కావడంతో ఈ వార్తలకు బలం చేకూర్చినట్లయ్యింది. తనకు ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయాన్ని ధ్రువీకరిస్తూ సునయన కూడ ఓ ఫోటో పెట్టింది. కానీ తనకు కాబోయే భర్త ఎవరనే దానిపై మాత్రం ఆమె ఎలాంటి హింట్ ఇవ్వలేదు. ఆ తర్వాత విషయం సద్దుమణగగా.. తన సినిమాలతో సునయన బిజీ అయ్యారు.

అయితే తాజాగా ఆమె తన ప్రియుడితో త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. సునయనకు కాబోయే భర్త ఎవరో కాదు.. దుబాయ్‌కి చెందిన యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఖలీద్ అల్ అమేరీ అని రూమర్స్ వస్తున్నాయి. తాజాగా స్వయంగా ఖలీద్.. సునయనత తన రిలేషన్‌ను బహిర్గతం చేశాడు. రెండ్రోజుల క్రితం ఖలీద్ తన పుట్టినరోజును సునయనతో కలిసి జరుపుకున్నాడు. హోటల్‌లో సునయన చేతిలో చేయి వేసి పట్టుకున్న సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అటు సునయన కూడా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఖలీద్ కట్ చేసిన కేక్‌‌ని పంచుకున్నారు. దాంతో వీరిద్దరి రిలేషన్ నిజమేనని, గతేడాది ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయం అబద్ధం కాదని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక ఖలీద్ విషయానికి వస్తే 1983 డిసెంబర్ 5న అబుదాబీలో జన్మించిన ఆయన అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చదువుకున్నారు. తొలుత సీఎన్ఎన్‌లో జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన 2007లో సాల్మా మొహమ్మద్‌ను పెళ్లాడారు. ఈ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు సంతానం. ఇక ఇన్‌ఫ్లూయెన్సర్‌గా, యూట్యూబర్‌గా ఖలీద్ యూఏఈతో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. అయితే దాదాపు 17 ఏళ్లపాటు కలిసి జీవించిన సాల్మాతో వైవాహిక బంధానికి తెరదించుతూ గతేడాది వీరిద్దరూ విడిపోయారు. ఈ క్రమంలోనే సునయనతో ప్రేమలో పడిన ఖలీద్ త్వరలోనే ఆమెను పెళ్లాడనున్నారు. ఖలీద్ - సునయనల డేటింగ్ వ్యవహారం ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.

More from Filmibeat

Read more about: sunaina khalid ai ameri
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X