twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఉదయ్ కిరణ్ బయోపిక్‌పై సందీప్ కిషన్ క్లారిటీ

    |

    ఒకప్పుడు తెలుగు తెరపై లవర్ బాయ్‌గా ఓ వెలుగు వెలిగిన కిరణం ఉదయ్ కిరణ్. ఎంత స్పీడుగా ఎదిగాడో.. అంతే స్పీడుగా కిందకు వచ్చేశాడు. వరుస హిట్లతో ఉక్కిరిబిక్కిరి అయిన ఉదయ్ కిరణ్.. వరుస ఫ్లాపులతోనూ సతమతమయ్యాడు. చివరకు వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఈ సంఘటన టాలీవుడ్‌లో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. మళ్లీ ఇన్నేళ్లకు ఉదయ్ కిరణ్ పేరు వార్తల్లో మార్మోగుతోంది.

    గత రెండు మూడు రోజులుగా ఉదయ్ కిరణ్ బయోపిక్ గురించి వార్తలు హల్ చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. హీరో సందీప్ కిషన్ ఈ బయోపిక్‌లో నటించనున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. ఉదయ్ కిరణ్ పాత్రలో సందీప్ కిషన్ నటించబోతోన్నాడనే వార్తలు అన్ని సెక్షన్ల మీడియాలో ప్రముఖంగా ప్రచురితమయ్యాయి. దీంతో ఈ వార్తలు సందీప్ కిషన్ చెవిన కూడా పడినట్టు తెలుస్తోంది. దీంతో ఈ రూమర్లకు చెక్ పెట్టేందుకు స్వయంగా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.

    Sundeep Kishan Condemns Rumors About Uday Kiran Biopic

    గత రెండు మూడు రోజులుగా తనపై వస్తోన్న వార్తలు నిజం కాదని స్పష్టం చేశాడు. తనను ఆ బయోపిక్ గురించి ఎవరు సంప్రదించలేదని తేల్చి చెప్పాడు. అలాగే ప్రస్తుతం తనకు ఎలాంటి బయోపిక్‌లో నటించే ఆలోచనే లేదని క్లారిటీగా చెప్పేశాడు. ఇంత త్వరగా మేల్కొని ఆ వార్తలను ఖండించడంతో సరిపోయింది కానీ.. అసలే ఇప్పుడిప్పుగే గాడిలో పడుతోన్న కెరీర్ కాస్త మళ్లీ డౌన్ అయ్యేది. తేజ లాంటి దర్శకుడే బయోపిక్ అనౌన్స్ చేసి వదిలేశాక.. మళ్లీ అంతటి తెగువ, ధైర్య సాహసాలెవరు చేస్తారు.

    English summary
    Uday Kiran Biopic News Is Going Viral. Sundeep Kishan Condemns Rumors About Uday Kiran Biopic. He Is Not Interested To Do Any Biopic.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X