కెరీర్లో సందీప్ కిషన్ కు కోలుకోలేని దెబ్బ..? ఎందుకిలా జరిగింది?
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం 'మజాకా' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యాక్షన్, కామెడీ, రొమాన్స్ కలగలిపిన ఈ చిత్రం మరో ఐదు రోజుల్లో థియేటర్లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. దర్శకుడు త్రినాధరావు నక్కిన డైరెక్ట్ చేస్తుండటం విశేషం. లవ్ అండ్ ఫ్యామిలీ స్టోరీలను ఆయన ఎంత చక్కగా తెరకెక్కిస్తారో తెలిసిందే. ఈసారి సందీప్ కిషన్ - యంగ్ హీరోయిన్ రీతూ వర్మలతో బిగ్ స్క్రీన్ పై ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారోనని ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సైలెంట్ గా వచ్చి కంటెంట్ తో ఆకట్టుకునే సందీప్ కిషన్ అభిమానులు కూడా ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు.
మరో నాలుగైదు రోజులు 'మజాకా' చిత్రం రిలీజ్ కాబోతుండటంతో ప్రస్తుతం యూనిట్ జోరుగా ప్రమోషన్స్ ను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. 'మజాకా' విశేషాలతో ఆడియెన్స్ లో ఆసక్తిని పెంచుతున్నారు. కాగా సందీప్ కిషన్ కూడా వరస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. గ్రూప్ గా చిట్ చాట్ చేస్తూ జోరుగా ప్రమోషన్ చేస్తున్నారు. వీలైనంత రేంజ్లో సినిమా రీచ్ పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇదిలా ఉండగా... సందీప్ కిషన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. సినిమాల విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకునే సందీప్ తన కెరీర్ లో ఓ బిగ్ మిస్టేక్ చేశారని అభిప్రాయడపతున్నారు. మరోవైపు సందీప్ ఆ మూవీ చేయాల్సిందంటూ అభిమానులు కూడా ఫీల్ అవుతున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటో కాదు.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్ష కురిపించి బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచిన 'హను-మ్యాన్'.
తేజా సజ్జా - ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో ఈ చిత్రం రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. 2024 జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ డూపర్ హిట్ అయ్యింది.
అదే సమయానికి రిలీజ్ లైన మహేశ్ బాబు 'గుంటూరు కారం'తో 'హనుమాన్' పోటీ పడింది. ధీటుగా కలెక్షన్లు కూడా రాబట్టింది. 40 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం రూ.350 కోట్లకు వరకు వసూళ్లు సాధించింది. పాన్ ఇండియా చిత్రంగా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. అయితే ఈ సినిమాకు ఫస్ట్ ఛాయిస్ గా యంగ్ హీరో సందీప్ కిషన్ ను అనుకున్నారంట. కానీ ఏ కారణం చేతనో ఈ సినిమా సందీప్ చేజారిపోయింది.

14 ఏళ్లుగా సందీప్ సినిమా తర్వాత సినిమా చేస్తూనే వస్తున్నారు. కానీ బాక్సాఫీస్ ను షేక్ చేసే సినిమా ఒక్కటైనా పడాలని ఆయన ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఆయన తీసే సినిమాలు కూడా ఒకటీరెండు మినహా, మిగితావన్నీ బోర్ కొట్టకుండా ఉండేలా తెరకెక్కించారు. యూత్ లో సందీప్ కు కూడా మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సందీప్ కు 'హను - మ్యాన్' మంచి హెల్ప్ అయ్యేదని, ఆయన కెరీర్ లో ఇప్పుడు వేరే రేంజ్ లో ఉండేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మళ్లీ అలాంటి అవకాశం ఎప్పుడొస్తుందో చూడాలి. ప్రస్తుతం త్వరలో రిలీజ్ కాబోతున్న 'మాజాకా'పై ఆసక్తి నెలకొంది.


Click it and Unblock the Notifications











