Don't Miss!
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Sports IPL 2024: చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ హైదరాబాద్!
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
రవితేజ దర్శకుడితో సందీప్ కిషన్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్.. ఈసారి మరింత కొత్తగా..
యువ హీరో సందీప్ కిషన్ సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నాడనే చెప్పాలి. ఇక చాలా రోజుల తరువాత నిను వీడని నీడను నేనే అనే సినిమాతో మంచి సక్సెస్ కొట్టిన విషయం తెలిసిందే. ఆ తరువాత చేసిన తెనాలి రామకృష్ణ BA.BL సినిమాతో కొంత హడావుడి చేసినప్పటికీ సరైన సక్సెస్ అందుకోలేదు.
ఇక నెక్స్ట్ సినిమాలతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. అయితే ఈ సారి ఎప్పుడు లేని విదంగా ఒక సరికొత్త సైన్స్ ఫిక్షన్ సినిమాతో రాబోతున్నట్లు తెలుస్తోంది. రవితేజతో డిస్కో రాజా అనే సినిమాను డైరెక్ట్ చేసిన విఐ.ఆనంద్ ఇటీవల చెప్పిన ఒక కథకు ఈ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎక్కడికి పోతావు చిన్నవాడ వంటి మంచి సినిమాలను డైరెక్ట్ చేసిన ఆనంద్ ఇదివరకే సందీప్ తో టైగర్ అనే సినిమా చేశాడు.
విభిన్న కథల కోసం సెర్చ్ చేస్తున్న సందీప్ కిషన్ కి ఆనంద్ సెట్ చేసిన కథ కరెక్ట్ గా సరిపోతుందట. నెక్స్ట్ సినిమా కోసం సందీప్ కొత్తగా కనిపించాలని ఫిట్నెస్ లో మార్పులు కూడా తెస్తున్నాడు. మొన్న బయటపెట్టిన ఫొటోలు కూడా ఇంటర్నెట్ లో బాగానే వైరల్ అయ్యాయి. అలాగే A1 ఎక్స్ ప్రెస్ తో పాటు మరో ముడు తమిళ సినిమాలు చేస్తున్నాడు ఈ యువ హీరో. మరి ఆ సినిమాలో ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.