ప్చ్..సునీల్ కూడా అలా తయారయ్యాడా?
కథ,స్క్ర్రీన్ ప్లే,దర్శకత్వం..అప్పలరాజు విడుదైన తర్వాత సునీల్ కి డౌన్ ఫాల్ స్టార్టైంది అన్నారు. కానీ సునీల్ మాత్రం తాను ఆచి తూచి మరీ అడుగులు వేస్తున్నానని చెప్తున్నారు. అయితే ఇప్పుడా ఆచి తూచి అడుగులు వేసే కార్యక్రమం మరీ వింతగా తయారైందని,ఆయన శ్రేయాభిలాషలు విమర్శిస్తున్నారు. సునీల్ తో సినిమా చెయ్యాలంటే నిర్మాత ముందుగా సునీల్ నే కలావాలి. అతను అప్పుడు తన దగ్గర ఆల్రెడీ ఫైనలైజ్ అయ్యి ఉన్న దర్శకుడుని,కథని ఆ నిర్మాత ముందు పెట్టి ఇదీ ప్రాజెక్టు,ఇవీ డేట్స్ చేస్తారా అని ప్రపోజల్ పెడ్తాడు. అప్పుడు ఆ నిర్మాతకు ఇష్టమైతే దాన్ని ఓకే చేసి డబ్బు విడుదల చేయాలి. అంతేగానీ నిర్మాతే స్వయంగా దర్శకుడుని,కథని ఎంపిక చేసుకుని హీరో దగ్గరకి రావటం అనే స్కీమ్ లేదట. ఏమిటి ఇలా ఇష్టముంటే చెయ్యటం..లేకపోతే తప్పుకోవటం అని క్లియర్ గా చెప్తున్నాడట. దాంతో పెద్ద నిర్మాతలు సైతం రెండు సినిమాల హీరోకే ఇంత బిల్డప్ ఏమిటని తలలు పట్టుకుని కూర్చుంటున్నారు.
అయితే ఇది సునీల్ కొత్తగా కనుక్కున్న పద్దతి కాదు. ఇప్పటికే కొందరు హీరోలు విజయవంతంగా దాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. దాన్నే సునీల్ ఎడాప్ట్ చేసుకుని కొనసాగిస్తున్నాడు. అయితే ఫామ్ లో ఉన్నప్పుడు ఇలాంటివి ఏమి చేసినా చెల్లుబాటు అవుతాయికానీ ఆ తర్వాత ఇలాంటి వాటితో తలనొప్పులు వస్తాయని అంటున్నారు. ప్రస్తుతం సునీల్..వీరభద్రం దర్సకత్వంలో పూలరంగడు చిత్రం చేస్తున్నాడు. ఆర్.ఆర్ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం కు కూడా సునీలే దర్శకుడుని,హీరోని ఓకే చేసి నిర్మాతకు పరిచయం చేసి ప్రాజెక్టు ప్రారంభించాడని చెప్తున్నారు. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











