SSMB28: మహేశ్ బాబు సినిమాలో ఊహించని విలన్.. ఆ స్టార్ హీరోను దింపుతున్న గురూజీ

అదిరిపోయే యాక్టింగ్.. హ్యాండ్సమ్ లుక్స్‌తో తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా గుర్తింపును దక్కించుకున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. కెరీర్ ఆరంభం నుంచీ తనదైన శైలి నటనతో, కమర్షియల్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. హిట్లు వచ్చినప్పుడు పొంగిపోకుండా.. ఫ్లాపులు ఎదురైనప్పుడు కృంగిపోకుండా ముందుకు సాగుతున్నాడు.

అందుకే సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో స్టార్‌ హీరోగా వెలుగొందుతున్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న మహేశ్ బాబు.. త్వరలోనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేయబోతున్నాడు. తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఆ సంగతులు మీకోసం!

హ్యాట్రిక్ హిట్లతో మహేశ్ దూకుడు

హ్యాట్రిక్ హిట్లతో మహేశ్ దూకుడు

ఆ మధ్య భారీ డిజాస్టర్లతో ఇబ్బందులు పడ్డ సూపర్ స్టార్ మహేశ్ బాబు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో చేసిన 'భరత్ అనే నేను' మూవీతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఆ వెంటనే వంశీ పైడిపల్లి రూపొందించిన 'మహర్షి', యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'సరిలేరు నీకెవ్వరు'తో వరుసగా మూడు విజయాలను అందుకుని హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

సర్కారు వారి పాట అంటోన్న హీరో

సర్కారు వారి పాట అంటోన్న హీరో

వరుస హిట్లతో ఫుల్ జోష్ మీదున్న పరశురాంతో మహేశ్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. థమన్ దీనికి సంగీతం అదిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తైంది.

లాంగ్ గ్యాప్ తర్వాత ఆ డైరెక్టర్‌తో

లాంగ్ గ్యాప్ తర్వాత ఆ డైరెక్టర్‌తో

'సర్కారు వారి పాట' షూట్ జరుగుతుండగానే మహేశ్ బాబు ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నాడు. అందులో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. దాదాపు 11 ఏళ్ల తర్వాత వీళ్ల కాంబోలో సినిమా రాబోతుండడంతో దీనిపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి.

మరింత ఆలస్యంగా కాబోతుందిగా

మరింత ఆలస్యంగా కాబోతుందిగా

మాటల మాంత్రికుడితో మహేశ్ బాబు చేయాల్సిన సినిమా ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, సర్కారు వారి పాట షూటింగ్ మరింత ఆలస్యం అవుతుండడంతో ఇది పట్టాలెక్కలేదు. ఇంతలో ఇటీవలే మహేశ్ బాబు మోకాలికి సర్జరీ జరిగింది. దీంతో ఈ సినిమా మరింత ఆలస్యంగానే ప్రారంభం కాబోతుంది. లేట్‌గా మొదలైనా వీలైనంత త్వరగా దీన్ని పూర్తి చేస్తారని టాక్.

ఆ పనులు పూర్తి.. ఇప్పుడా వర్క్‌తో

ఆ పనులు పూర్తి.. ఇప్పుడా వర్క్‌తో

'అతడు', 'ఖలేజా' వంటి చిత్రాల తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మహేశ్ బాబు జత కట్టడంతో ఈ ప్రాజెక్టు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక, ఈ మూవీ కోసం త్రివిక్రమ్ ఇప్పటికే డైలాగ్ వెర్షన్‌తో కూడిన ఫుల్ స్క్రిప్టును రెడీ చేసేశాడట. అంతేకాదు, థమన్ కూడా కొన్ని పాటలు రెడీ చేశాడు. మొత్తంగా ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ చేసి ఇప్పుడు కాస్టింగ్ మీద దృష్టి సారించారని తెలిసింది.

మహేశ్ కోసం ఊహించని విలన్

మహేశ్ కోసం ఊహించని విలన్

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో మహేశ్ బాబును ఢీ కొట్టబోయే విలన్ ఎవరన్న దానిపై ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ కోసం బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టిని తీసుకుంటున్నారని తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X