ఆమెను వదలలేక సునీల్ నెక్స్ట్ సినిమాలోనూ...
సునీల్,ఇషాఛావ్లా కాంబినేషన్ లో వచ్చిన పూల రంగడు మంచి హిట్ అయ్యిన సంగతి తెలిసిందే. ఆ ఉత్సాహంలో ఉన్న సునీల్ తన తదుపరి చిత్రానికి సైన్ చేసాడు. అయితే హీరోయిన్ గా ఇషాఛావ్లానే తీసుకోవాలనే కండీషన్ పెట్టినట్లు తెలుస్తోంది. దాంతో ఇప్పుడు సునీల్ సరసన ఇషాఛావ్లానే మళ్లీ బుక్ చేసారు నిర్మాతలు. తను వెడ్స్ మను రీమేక్ గా రూపొందే ఆ చిత్రం మార్చి 26న ప్రారంభం కానుంది. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్ వారు రూపొందించే ఆ చిత్రంలో కంగనారౌనవత్ చేసే పాత్రను ఇషా ఛావ్లా పోషించనుంది. గతంలో ఆడుతూ పాడుతూ,లీలా మహల్ సెంటర్, బ్లేడ్ బాబ్డీ వంటి హిట్ చిత్రాలు డైరక్ట్ చేసిన దేవి ప్రసాద్ దర్సకత్వంలో ఆయన సినిమా చేయబోతున్నారు.
మెగా సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ పైన ఆర్.బి.చౌదరి నిర్మించే ఈ చిత్రం ఈ నెల 26న ప్రారంభం కానుంది. హిందీ సూపర్ హిట్ చిత్రం తను వెడ్స్ మను రీమేక్ గా ఈ చిత్రం రూపొందనుంది. తెలుగు నేటివిటికి తగ్గట్లుగా ఈ చిత్రంలో మార్పులు చేసి స్క్రిప్టు తిరగరాసారని తెలుస్తోంది. ఇక హిందీలో ఈ చిత్రం మంచి విజయం సాధించింది. మాధవన్, కంగనా రౌనత్ కాంబినేషన్ లో రూపొందిన ఈ హిందీ చిత్రం తక్కువ బడ్జెట్ లో రూపొందిన ఈ చిత్రం తెలుగులోనూ మంచి విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. ఇక దేవిప్రసాద్ ..అల్లరి నరేష్ తో చేసిన బ్లేడ్ బాబ్జీ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఈ చిత్రం కమిటయ్యారు. సునీల్ అమాయికపు నటనతో మాధవన్ పాత్రలో మరోసారి నవ్వులు పూయించటానికి రెడీ అవుతున్నారు. ఇషాఛావ్లా కి బయిట ఆఫర్స్ రాకున్నా సునీల్ అండతో కంటిన్యూ అవుతోంది.


Click it and Unblock the Notifications











