సునీల్ బ్రేక్ తీసుకోవాలని నిర్ణయం
సునీల్ తనకు పూర్తి స్ధాయి బ్రేక్ రావాలంటే కొన్ని నిర్ణయాలు తప్పనిసరి అనే నిర్ణయానకి వచ్చాడు.అందులో భాగంగా కమిడెయన్ గా బ్రేక్ తీసుకోవాలని పూర్తిగా హీరో గా ప్రూవ్ చెయ్యటం మీదే కాన్సర్టేషన్ చెయ్యాలని నిర్ణయించుకున్నాడు.మొహమాటం కోసం పెద్ద హీరోలు,దర్శకుల సినిమాల్లో కామిడీ చేస్తూంటే అతన్ని హీరోగా చెయ్యాలనుకున్న దర్శకులు డైలమోలో పడుతున్నారు.అందులోనూ అప్పలరాజు దెబ్బకు వెనకపడ్డ సునీల్ ఇమ్మీడియట్ గా నిరూపించుకుని తన షేర్ మార్కెట్లో ఎంతుందో ప్రూవ్ చెయ్యాల్సిన సిట్యువేషన్ ఏర్పడింది.అందులో భాగమే ఈ బ్రేక్ నిర్ణయం.
అయితే ఈ నిర్ణయం కొందరు పెద్ద దర్శకులుకు నచ్చటం లేదు.అతన్ని అనుకుని స్క్రిప్టులో ఓ క్యారెక్టర్ తయారుచేసుకుంటే ఇప్పుడు మా పరిస్ధితి ఏమటనేది వారి సందేహం.అయితే సునీల్ ఖచ్చింతగా తాను చేయలేనని చెప్తున్నాడు.త్రివిక్రమ్ సినిమాలో కూడా అలా చెప్పబట్టే ఆ కామిడీ బ్లాక్ ని ఫిలప్ చేయటానికి రాజేంద్ర ప్రసాద్ తో కొంత కామెడీ రప్పించేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం.ఇక ప్రస్తుతం సునీల్..అహనా పెళ్ళంట చిత్రంతో పరిచయమైన వీరభద్ర చౌదరి దర్శకత్వంలో పూలరంగడు అనే సినిమా కమిటయ్యాడు.ఆర్.ఆర్.మూవీమేకర్స్ నిర్మించే ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రేమే కావాలిలో నటించిన ఇషా కమిటైంది.ఈ చిత్రం తర్వాత దేవి ప్రసాద్ దర్శకత్వంలో తను వెడ్స్ మను రీమేక్ చెయ్యనున్నాడు.


Click it and Unblock the Notifications











