అజయ్ హీరోగా సునీల్ దర్శకత్వంలో...
కంగారుపడకండి..సునీల్ ఏమీ డైరక్టర్ గా మారటం లేదు. డైరక్టర్ అప్పలరాజుగా నటిస్తున్న కథ,స్క్రీన్ ప్లే, దర్సకత్వం చిత్రంలో అజయ్ ని డైరక్ట్ చేస్తూ కనపడతాడు. అలాగే మరో చరిత్ర చిత్రంలో విలన్ గా చేసిన ఆదర్శ్ కూడా మరో హీరోగా కనిపించనున్నారు. ఇక కలర్స్ స్వాతి..అసెస్టెంట్ డైరక్టర్ గా కనిపించనుందని ముందే తెలిసిందే. వీటికి తోడు వెబ్ మీడియామీద సెటైర్ చేస్తూ...ఈవీ...హాఫ్ బ్రెయిన్ అనే పాత్రను కల్పించి రాజా రవీంద్ర చేత చేయిస్తున్నారు. ఇక రామ్ గోపాల్ వర్మ దర్సకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఓపినింగ్ ఆ మధ్య ఘనంగా శ్రీదేవి, నాగార్జున చేతుల మీదుగా జరిగింది. ఓపినింగ్ రోజే డైరక్టర్స్ ని సెటైర్ చేస్తూ ఓ పాటను రిలీజ్ చేసి బాంబులా విసిరి అందరి నోట్లో నానేలా చేసి క్రేజ్ తెచ్చారు వర్మ.


Click it and Unblock the Notifications











