అప్పలరాజు సెట్స్ పై అతి చేస్తున్న సునీల్?
అప్పలరాజుకి అంతా సునీలేనా...రామ్ గోపాల్ వర్మ కేవలం దర్శకత్వం మాత్రమే చేస్తున్నారా అనే టాపిక్ పరిశ్రమలో హాట్ హాట్ గా నడుస్తోంది. సునీల్ దగ్గరుండి తనకు కావల్సినట్లు డైలాగులు రాయించుకోవటం, తనకిష్టమైన ఆర్టిస్టులను సెలక్షన్ చేయటం చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. మర్యాదరామన్న హిట్ క్రెడిట్ మొత్తం రాజమౌళికి వెళ్ళిపోవటంతో తిరిగి తన హవాకోసం సునీల్ విపరీతంగా శ్రమిస్తున్నాడని చెప్పుకుంటున్నారు. అమలాపురం నుంచి హైదరాబాద్ వచ్చి దర్శకత్వం చేసేద్దామని తిరిగే యువకుడుగా సునీల్ ఈ అప్పలరాజు చిత్రంలో కనిపించనున్నారు. ఇక రామ్ గోపాల్ వర్మ దృష్టి మొత్తం రక్త చరిత్ర చిత్రం పైనే ఉందని, ఆ చిత్రం ప్యాచ్ వర్క్ హడావిడిలో ఉన్నారని చెప్పుకుంటున్నారు.
దాంతో పూర్తి స్ధాయి స్వేచ్చతో అప్పలరాజులాగా సునీల్ అన్ని డిపార్టమెంట్ లు తనకే తెలసన్నట్లుగా పనిచేయటం కొందరి సీనియర్స్ ఇబ్బంది కలిగిస్తోంది. మరో ప్రక్క ఈ చిత్రం కోసం వదిలిన పాటలో కూడా సునీల్ హస్తం ఉందని వర్మ స్టేజీ మీద నవ్వటానికే చెప్పినా కొందరు నిజంగా సునీల్ హస్తం ఉందని నమ్మి చిరాకుపడుతున్నారు. ఇంతకీ సంక్రాంతికి రిలీజయ్యే ఈ చిత్రం నిజంగా నవ్వులు పండిస్తే ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదు. అలాక్కూకుండా కేవలం సినిమావాళ్ళు ఎంజాయ్ చేయటానికే అన్నట్లు కథ ఉంటేనే అసలు సమస్య. ఎందుకంటే తెర వెనక జరిగే పాలిటిక్స్ జనాలికి పెద్దగా తెలియదు.చెప్పినా నమ్మి ఎంజాయ్ చేసే స్ధితిలో ఉండరని వర్మ శిష్యులు ఆల్రెడీ నేనింతే, ఒక విచిత్రం,ఫిల్మ్ నగర్ లతో నిరూపించేసారనే సంగితి తెలిసిందే.


Click it and Unblock the Notifications











