త్వరలో కెఏ పాల్ బయోపిక్... హీరో ఎవరంటే?
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. తన పొలిటికల్ ప్రసంగాలు, వింత ప్రచారాలు అందరినీ నవ్వించాడు. ఓ వైపు సీరియస్‌గా ఎన్నికలు జరుగుతుంటే తనదైన కామెడీ చేష్టలతో నవ్వులు పూయించాడు.
త్వరలో కెఏ పాల్ బయోపిక్ తెరకెక్కబోతున్నట్లు ఫిల్మ్ నగర్లో ప్రచారం మొదలైంది. ఈ చిత్రంలో ప్రముఖ తెలుగు కామెడీ స్టార్ సునీల్ మెయిన్ లీడ్ చేయబోతున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా గురించి అటు ఇటు సునీల్ నుంచి కానీ, అటు కెఏ పాల్ నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

తెలుగు సినీ పరిశ్రమకు చెందని ఓ ప్రముఖ ప్రొడక్షన్ కంపెనీ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తోందని, కొత్త దర్శకుడు దీన్ని హ్యాండిల్ చేయబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ బయోపిక్ గురించి అఫీషియల్ సమాచారం వెలువడే అవకాశం ఉంది.
కమెడియన్ నుంచి హీరోగా టర్న్ అయిన సునీల్... కొంతకాలం పాటు కమర్షియల్ సినిమాలు మాత్రమే చేస్తూ ముందుకు సాగాడు. అయితే హీరోగా అతడికి కలిసి రాకపోవడంతో మళ్లీ కామెడీ పాత్రల వైపు టర్న్ అయ్యాడు. సునీల్ కమెడియన్‌గా నటించిన చివరి చిత్రం 'చిత్రలహరి' అతడికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
కెఏ పాల్ బయోపిక్... కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న సినిమా కావడంతో చేయడానికి ఒకే చెప్పాడని, సునీల్ మార్క్ కామెడీతో ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు తయారవుతోందని, ఇటీవల ఎన్నికల్లో కెఏ పాల్ చేసిన పొలిటికల్ స్టంట్స్ అన్నీ ఇందులో చూపించబోతున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











