షాక్ ఇచ్చే రేంజిలో పెరిగిన సునీల్ రెమ్యునేషన్
రాజమౌళితో మర్యాదరామన్న చిత్రం చేసిన సునీల్ తన రెమ్యునేషన్ భారీ స్ధాయిలో పెంచేసాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. వారు చెప్పుకునే దాని ప్రకారం సునీల్ ఇప్పుడు రెండు కోట్ల రూపాయలు రెమ్యునేషన్ డిమాండ్ చేస్తున్నాడు. టాలీ టు హాలీ వారికి సునీల్ ఇప్పుడు నాకేంటి అనే చిత్రం చేస్తున్నాడు. యువత, ఆంజనేయులు చిత్రాలు రూపొందించిన దర్శకుడు పరుశరామ్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయటానికి రెడీ అవుతున్నాడు. ఇక ఈ చిత్రం తర్వాత సునీల్..రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం..అప్పలరాజు అనే చిత్రంలో చేస్తున్నాడు. దాంతో తన దగ్గరకు వచ్చే ప్రతీ దర్శకుడుతో చెయ్యటం ఇష్టంలేక ఇలా రేటు పెంచి భయపెడుతున్నాడని మరో వైపు వినపడుతోంది. ఇక నిజంగా రేటు పెంచితే సునీల్ తన చేత్తో తన గొయ్యే తానే తీసుకున్నట్లు అవుతుందని సీనియర్స్ వ్యాఖ్యానిస్తున్నారు. ఏదైమైనా ఓ కామిడీ హీరో ఈ రేంజిలో రెమ్యునేషన్ డిమాండ్ చేయటం మాత్రం రికార్డే.


Click it and Unblock the Notifications











