తూచ్ బండ్ల కాదట.. ఆ సినిమా కోసం రంగంలోకి సునీల్.. మళ్ళీ హీరోగా?

ఈ మధ్యకాలంలో రీమేక్ ట్రెండ్ పెరిగింది.. ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాలను ఇతర భాషల వాళ్ళు రీమేక్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. మరీ ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు తమిళ, మలయాళ భాషల్లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలను రీమేక్ చేయడం మీద ఆసక్తి చూపెడుతున్నారు. తాజాగా తమిళంలో తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబు టైటిల్ రోల్లో నటించిన మండేలా సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నాయి బ్రాహ్మణులకు సంబంధించిన కథాంశంతో రూపొందిన ఈ సినిమా ఈ మధ్యనే నెట్ ఫ్లిక్స్ లో విడుదలై సూపర్ హిట్ అందుకుంది.

అయితే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారని యోగి బాబు పాత్రలో బండ్లగణేష్ నటించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే ఆ సంగతి అలా ఉంచితే ఇప్పుడు తాజాగా మరో ప్రచారం మొదలైంది. కమెడియన్ గా మొదలై ఆ తర్వాత హీరోగా మారిన సునీల్ తో ఈ పాత్ర కోసం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ క్రింద అనిల్ సుంకర ఈ సినిమా రీమేక్ హక్కులు కొనుక్కున్నారు.. ఆయన యోగిబాబు స్థానంలో సునీల్ అయితేనే న్యాయం చేయగలరని భావిస్తున్నారని తెలుస్తోంది.

Sunil in talks for remake of Tamil film Mandela

ఈ సినిమా కామెడీ జానర్ లో సాగుతూ పొలిటికల్ సెటైర్ మూవీగా ఉంటుంది. ఈ సినిమాలో నటనకు గాను యోగిబాబుకి మంచి ప్రశంసలు దక్కాయి. అన్నీ అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే యోగిబాబు పాత్రలో సునీల్ నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక ప్రస్తుతం ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాను తెలుగులో తెరకెక్కించే దర్శకుడు కోసం వెతుకులాటలో ఉన్నట్లు తెలుస్తోంది.. ఒకసారి దర్శకుడు ఫైనల్ అయితే ఈ సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X