ప్రబాస్ డైరక్టర్ తో సునీల్ ఖరారు
పూల రంగడు ఘన విజయంతో ఓవర్ నైట్ లో సునీల్ తెలుగు స్టార్ హీరోల్లో ఒకరిగా మారిపోయిన సంగతి తెలిసిందే. దాంతో ఓ మాదిరి డైరక్టర్స్ సైతం అతనితో చేయటానికి ఆసక్తి చూపుతున్నారు. తాజాగా లారెన్స్ అతనితో సినిమా చేయటానికి డేట్స్ ఖరారు చేసుకున్నట్లు వినపడుతోంది. లారెన్స్ అతనికో ఓ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ కథ వినిపించి డేట్స్ ఓకే చేయించుకున్నట్లు చెప్తున్నారు. సునీల్ చూపిన సిక్స్ ప్యాక్ బాడీని చూసిన లారెన్స్ ఓ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ కథతో సునీల్ ని కొత్తగా చూపటానికి రెడీ అవుతున్నాడని చెప్పుకుంటున్నారు.
మరో ప్రక్క వివి వినాయిక్ సైతం తన తదుపరి చిత్రాన్ని సునీల్ తో ప్లాన్ చేయటానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. సునీల్ సైతం వినాయిక్ దర్శకత్వం అంటే వెంటనే డేట్స్ ఇవ్వటానికి సిద్దపడ్డాడని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం సునీల్.. హిందీలో హిట్టైన తను వెడ్స్ మను చిత్రం రీమేక్ చేస్తున్నారు. ఆడుతూ.. పాడుతూ వంటి కామెడీ చిత్రం డైరక్ట్ చేసిన దేవిప్రసాద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. లారెన్స్ తను ప్రభాస్ తో చేస్తున్న రెబెల్ చిత్రానికి తుది మెరుగులు దిద్దుతున్నారు.


Click it and Unblock the Notifications











