'భీమవరం బుల్లోడు' టైటిల్ తో సునీల్ చిత్రం
హైదరాబాద్: హాస్య నటుడు నుంచి హీరోగా ఎదిగిన సునీల్ త్వరలో 'భీమవరం బుల్లోడు' గా కనిపించి అలరించనున్నారు. ఈ చిత్రాన్ని కలిసుందాం రా, రారాజు వంటి చిత్రాలు డైరక్ట్ చేసిన తమిళ దర్శకుడు ఉదయశంకర్ డైరక్ట్ చేస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రం నిర్మితమవుతుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా... ఎస్తర్ అనే కొత్త అమ్మాయి చేస్తోంది. ఆమె ఇప్పటికే సాయిరాం శంకర్ సరసన వెయ్యి అబద్దాలు చిత్రంలో చేస్తోంది.
సునీల్ మాట్లాడుతూ.. ''సురేష్ ప్రొడక్షన్స్ లో చాలా సినిమాల్లో నటించాను. హీరోగా ఈ బ్యానర్లో నాకు అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ విత్ పాన్, ఐస్ క్రీమ్ లా ఉంటుందని, నా సినిమాల్లో ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఇందులో ఉంటాయన్నారు.
దర్శకుడు ఉదయ్ శంకర్ మాట్లాడుతూ.... ఈ కథకి సునీల్ పర్ ఫెక్టుగా సూటవుతాడని అతన్ని హీరోగా ఎంచుకున్నాము. ఎంటర్‌టైన్మెంట్ అండ్ కామెడీకి ఫుల్ స్కోపు ఉన్న సినిమా. సునీల్ బర్త్ డే రోజు ఈ కథను ఆయనకు రెండు గంటలపాటు వివరించాను. బర్తడే గిఫ్ట్ గా నా సినిమాలో హీరోగా చేయడానికి ఆయన ఒప్పుకున్నారు అని చెప్పారు.
నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ... సునీల్ తో ఎప్పటి నుంచో మా బ్యానర్లో సినిమా చేయాలనుకుంటున్నాము. ఈ రోజుతో అది కుదిరింది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి విశేషాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ఈచిత్రానికి కథ: కవి కాళిదాస్, మాటలు: శ్రీధర్ సీపాన, ఆర్ట్: వివేక్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: శేఖర్ వి.జోసెఫ్, సంగీతం: మణి శర్మ, సమర్పణ: డా. డి రామానాయుడు, నిర్మాత, సురేష్ బాబు, దర్శకత్వం-స్క్రీన్ ప్లే: ఉదయ్ శంకర్.


Click it and Unblock the Notifications











