స్టార్ డైరక్టర్ నెక్ట్స్ సునీల్ తో ఖరారు
పూల రంగడు ఘన విజయంతో సునీల్ స్టార్ హీరోల్లో ఒకరిగా మారిపోయారు. దాంతో స్టార్ డైరక్టర్స్ సైతం అతనితో చేయటానికి ఆసక్తి చూపుతున్నారు. తాజాగా వివి వినాయిక్ సైతం తన తదుపరి చిత్రాన్ని సునీల్ తో ప్లాన్ చేయటానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. సునీల్ సైతం వినాయిక్ దర్శకత్వం అంటే వెంటనే డేట్స్ ఇవ్వటానికి సిద్దపడ్డాడని చెప్పుకుంటున్నారు. సునీల్ చూపిన సిక్స్ ప్యాక్ బాడీని చూసిన వినాయిక్ ఓ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ కథతో సునీల్ ని కొత్తగా చూపటానికి రెడీ అవుతున్నాడని చెప్పుకుంటున్నారు.
ప్రస్తుతం సునీల్.. హిందీలో హిట్టైన తను వెడ్స్ మను చిత్రం రీమేక్ చేస్తున్నారు. ఆడుతూ.. పాడుతూ వంటి కామెడీ చిత్రం డైరక్ట్ చేసిన దేవిప్రసాద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. అలాగే వినాయిక్ ప్రస్తుతం రామ్ చరణ్ తేజ చిత్రం రూపొందిస్తూ బిజీగా ఉన్నారు. తండ్రి ఆశయం నెరవేర్చే కొడుకు కథతో ఆ చిత్రాన్ని వినాయిక్ రూపొందిస్తున్నారు. ఆకుల శివ కథ అందిస్తున్న ఆ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా చేస్తోంది. ఈ ప్రాజెక్టు అవ్వగానే సునీల్ ప్రాజెక్టు ప్రారంభం కానుందని సమాచారం. మొత్తానికి సునీల్ తన కామెడీ ముద్రని వదిలించుకుని మెయిన్ స్ట్రీమ్ లోకి వస్తున్నట్లే.


Click it and Unblock the Notifications











