సునీల్ సినిమాకు ఈసారి జైతెలంగాణ దెబ్బ!
సంక్రాంతికి రిలీజ్ అవుతుందనుకున్న సునీల్ 'పూల రంగడు' ప్రతిసారి ఏదో ఒక కారణంతో వాయిదా మీద వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. చివరకు పిబ్రవరి 3న సినిమా విడుదల చేస్తున్నట్లు ఇటీవల నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సారి కూడా సునీల్ సినిమా మరోసారి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో సునీల్ సినిమాను 'బిజినెస్ మేన్', బాడీగార్డ్ లాంటి సినిమాలు దెబ్బ కొట్టి వెనక్కి నెట్టేస్తే...ఈ సారి 'జై తెలంగాణ' సినిమా 'పూల రంగడు' సినిమాను ఓ తోపు తోయనుందని తెలుస్తోంది. ఉద్యమకారుల ఆగ్రహానికి గురి కాకుండా 'జై తెలంగాణ' సినిమాకు నైజాం ఏరియాలో ఎక్కువ థియేటర్లు కేటాయించారు. దీంతో సునీల్ సినిమాకు అవసరమైనన్ని థియేటర్ల దొకరలేదు. ఈ నేపథ్యంలో నిర్మాతలు ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 18న విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
సునీల్, ఇషా చావ్లా జంటగా నటిస్తున్న ఈచిత్రానికి వీరభద్రం చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్ ఆర్ మూవీ మేకర్స్ వారు ఈచిత్రాన్ని నిర్మించారు. కామెడీ అండ్ ఎంటర్ టైన్మెంట్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రం పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. సునీల్ తొలిసారిగా ఈచిత్రంలో సిక్స్ ప్యాక్ బాడీని ప్రదర్శించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన లభించింది.
జై తెలంగాణ సినిమాకు నిర్మాత, దర్శకుడు రసమయి బాలకిషన్. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఈ సినిమా రూపొందించారు. ఉద్యమంలో కళాకారుల పాత్ర గురించి ఈ సినిమాలో ఎక్కవ ఎక్స్ ఫోజ్ చేశారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











