twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సునీల్ కొత్త చిత్రం టైటిల్ 'సుందర్ అండ్ కో '

    By Srikanya
    |

    హైదరాబాద్: సునీల్ త్వరలో చేయబోతున్న చిత్రానికి 'సుందర్ అండ్ కో ' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఈ చిత్రం రీపొందనుంది. తెలుగులో రీమేక్‌ సినిమాలు తీయడంలో పెట్టింది పేరు... భీమనేని శ్రీనివాసరావు. ఇదివరకు ఆయన తీసిన పలు చిత్రాలు విజయవంతమయ్యాయి. ఏడాది కిందట నరేష్‌తో 'సుడిగాడు' చిత్రాన్ని తెరకెక్కించి విజయాన్ని అందుకొన్నారు. తాజాగా మరో సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు.

    తమిళంలో విజయవంతమైన 'సుందరపాండ్యన్‌' చిత్రాన్ని తెలుగులో సునీల్‌ హీరోగా తెరకెక్కిస్తారని సమాచారం. ఇటీవలే కథ విన్న సునీల్‌ ఇందులో నటించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కథాచర్చలు సాగుతున్నాయని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లబోతోందని సమాచారం. ప్రస్తుతం సునీల్‌ 'భీమవర బుల్లోడు' చిత్రంలో నటిస్తున్నారు.

    మరో ప్రక్క తఢాఖా చిత్రంలో నాగచైతన్య తో కలిసి హీరోగా చేసిన సునీల్ మరోసారి ఇలాంటి స్కీమ్ తో మన ముందుకు రాబోతున్నాడు. తమిళంలో విజయవంతమైన 'Varuthapadatha Valibar Sangam'చిత్రం రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ సారి రాజశేఖర్ తో కలిసి సునీల్ చేయనున్నారు.ఈ చిత్రం రీమేక్ రైట్స్ ని సురేష్ కొండేటి ప్యాన్సీ రేటు పెట్టి తీసుకున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. త్వరలోనే అఫీషియల్ గా ఈ చిత్రం గురించి ప్రకటన వస్తుందని చెప్తున్నారు. తమిళంలో ఏడు కోట్లతో నిర్మితమైన ఈ చిత్రం దాదాపు 30 కోట్లకు పైగా మొదటి మూడు వారాల్లో కలెక్టు చేసింది.

    ఇక ఇప్పటి వరకు అల్లరి చిల్లర పాత్రల్లో నటించిన సునీల్ త్వరలో ఓ విభిన్నమైన పాత్రలో తెరపై కనిపించబోతున్నాడు. 'భక్త కన్నప్ప'గా సునీల్ నటించబోతున్నాడని సమాచారం. ఈ చిత్రానికి తనికెళ్ల భరణి దర్శకత్వం వహించబోతున్నారట. ఇప్పటికే భక్త కన్నప్ప కథ తెలుగులో రెండు సార్లు తెరకెక్కింది. గతంలో కన్నడ కంఠీవర రాజ్ కుమార్, రెబల్ స్టార్ కృష్ణం రాజు లాంటి లెజెండ్స్ భక్త కన్నప్ప పాత్రలను పోషించారు. అయితే ఈ సారి తనికెళ్ల భరణి ఆ పాత్రకు సునీల్‌ను ఎంచుకోవడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.

    English summary
    Sunil will be the hero of director Bhimaneni Srinivas Rao's next film. This director hit the bulls eye with the superhit film Sudigadu. Sunil has been finalized as the hero of his next film. Now after a year he is back with a script which is inspired by a Tamil film Suderapandian (2012). The film will go on floors shortly. Rest of the cast is yet to be finalized.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X