Viswambhara: చిరంజీవి మూవీలో పుష్ప స్టార్.. ఆ సీన్స్ మాత్రం కెవ్వు కేక!
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి వచ్చినా.. అన్ని విభాగాల్లోనూ మెప్పించి బడా హీరోగా ఎదిగిపోయారు మెగాస్టార్ చిరంజీవి. అలా దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన టాలీవుడ్‌లో హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నారు. ముఖ్యంగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరంజీవి మరింత ఉత్సాహంతో కనిపిస్తున్నారు. అందుకే వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తున్నారు.
చిరంజీవి ఇటీవలే 'భోళా శంకర్' మూవీతో వచ్చారు. ఈ చిత్రం మాత్రం భారీ నష్టాలతో డిజాస్టర్‌గా మిగిలిపోయింది. దీంతో ఈ సారి ఎలాగైనా భారీ సక్సెస్‌ను సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం మెగాస్టార్ ఇప్పుడు 'బింబిసార' దర్శకుడు మల్లిడి వశిష్టతో ఓ సినిమాను చేయబోతున్నారు. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమాలు గ్రాండ్‌గా జరిగాయి.

మెగాస్టార్ చిరంజీవి - మల్లిడి వశిష్ట కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాను సోషియో ఫాంటసీ జోనర్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా కాన్సెప్టు పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో పంచ భూతాలను చూపించి సినిమాపై ఆసక్తిని పెంచేశారు. ఇక, ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను కూడా మొదలు పెట్టేసిన విషయం తెలిసిందే.
యంగ్ డైరెక్టర్ మల్లిడి వశిష్టతో మెగాస్టార్ చిరంజీవి చేయబోయే సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందించబోతున్నట్లు ఇప్పటికే న్యూస్ వైరల్ అయింది. అందుకే ఈ చిత్రం కోసం దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉన్న నటీనటులను తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇలా ఇప్పుడు ఈ మూవీలో అత్యంత కీలకమైన పాత్ర కోసం సునీల్‌ను ఫైనల్ చేసినట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది.

క్రేజీ కాన్సెప్టుతో రూపొందుతోన్న ఈ సినిమాలో సునీల్‌ను తీసుకోవాడానికి కారణం.. అతడికి 'పుష్ప' మూవీ తర్వాత దేశ వ్యాప్తంగా గుర్తింపు రావడమే అని తెలుస్తోంది. అంతేకాదు, ఈ చిత్రంలో చిరంజీవి గోదావరి జిల్లా వ్యక్తిగా నటిస్తుండడంతో అతడికి సునీల్ అయితేనే కరెక్ట్ కాంబో అవుతుందని ఆలోచించారట. ఇక, వీళ్లిద్దరి మధ్య వచ్చే కామెడీ సీన్స్ కెవ్వు కేకలా ఉంటాయని టాక్.
ఇదిలా ఉండగా.. చిరంజీవి - వశిష్టం కాంబోలో వస్తున్న ఈ సినిమాకు 'విశ్వంభర' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో అనుష్క శెట్టి సహా మరికొందరు హీరోయిన్లుగా నటిస్తున్నట్లు తెలిసింది. అలాగే, దగ్గుబాటి రానా విలన్‌గా చేస్తున్నాడని అంటున్నారు.


Click it and Unblock the Notifications











