»   »  సునీల్ ఇది నిజమా? చిరు కోసం త్యాగమా?

సునీల్ ఇది నిజమా? చిరు కోసం త్యాగమా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి అంటే సునీల్ కు మొదటి నుంచీ ఇష్టం. ఆయనతో కలిసి నటించాడు. ఆయనను కొన్ని సినిమాల్లో అనుకరించాడు. ఆయన డాన్స్ మూవ్ మెంట్స్ ఈజీగా చేసేయగలడు సునీల్. ఆయన హీరోగా కెరీర్ మొదలెట్టిన తర్వాత గమనిస్తే ఆయన పాటల్లో చిరంజీవిని అనుకరిస్తూ స్టెప్స్ వేయటం,ఆయనలా హెయిల్ స్టైల్ నుంచి డ్రస్ సెన్స్ దాకా మెయింటైన్ చేయటం గమనించవచ్చు. అలాంటి అన్నయ్య కోసం ఇప్పుడు సునీల్ ఓ త్యాగం చేయబోతున్నట్లు సమాచారం.

హాస్య నటుడుగా కెరీర్ మొదలెట్టిన సునిల్ స్టెప్ బై స్టెప్ ఎదిగి హీరోగా సెటిలయ్యాడు. ఇటువంటి సమయంలో ఎంత మంది తమ సినిమాల్లో కమిడియన్ గా చేయమన్నా కూడా రిజెక్ట్ చేస్తూ వస్తున్నాడు. కానీ తాజాగా చిరంజీవి పిలిచి అడగటంతో కమిడయన్ గా చేయటానికి కమిటయ్యాడని సమాచారం.

Sunil Turning Comedian For Chiranjeevi 150th movie

పూర్తి వివరాల్లోకి వెళితే... చిరంజీవి ఇప్పటికే తన 150 వ సినిమాపై కసరత్తులు ప్రారంభించాడు. ఈ సినిమాకు సంబందించి చిరు నుండికానీ, వినాయక్ నుండి ఇంకా ఆఫిషియల్ ప్రకటన రాకపోయినా పనులు మాత్రం వేగవంతంగా జరుగుతన్నాయి. ఈ నేపధ్యంలో చిరంజీవి...రీసెంట్ గా సునీల్ ని పిలిచి మాట్లాడారని సమాచారం.

తమ కాంబినేషన్ లో వచ్చిన అందరివాడు, జై చిరంజీవ చిత్రాల కామెడీని గుర్తు చేస్తూ మరో సారి అలాంటి ఫన్ ని తెరపై పండిద్దామని సునీల్ తో అన్నట్లు, సునీల్ వెంటనే మరో మాట మాట్లాడకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజం అయితే, మనం ఎంతగానో ఎంజాయ్ చేసిన సునిల్ కామేడీని మళ్ళీ మనం ఎంజాయ్ చేయొచ్చు.

English summary
Sunil will make his comeback as a comedian with Chiranjeevi's 150 th film.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu