తెలంగాణా ఎఫెక్ట్ : సునీల్ చిత్రం టైటిల్ మార్పు??

By Srikanya

హైదరాబాద్: హాస్య నటుడు నుంచి హీరోగా హీరోగా మారి తనకంటూ సొంత మార్కెట్‌ను సాధించిన సునీల్ కూడా ఈ ఏడాది చివరిలోగా 'దసరా బుల్లోడు'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈ చిత్రానికి మొదట 'భీమవరం బుల్లోడు' అనే టైటిల్ అనుకున్నారు. సునీల్ భీమవరం పేరుతో బాగా ఫేమస్ కనుక ఈ టైటిల్ అతనికి సరిగ్గా సరిపోతుందని భావించారు. అయితే భీమవరం అనే టైటిల్ పెడితే తెలంగాణా ప్రాంతంలో వ్యతిరేకత ఎదురవ్వవచ్చనే ఆలోచనతో ఈ టైటిల్ ని మార్చారని చెప్పుకుంటున్నారు. .

సునీల్ మాట్లాడుతూ.. ''సురేష్ ప్రొడక్షన్స్ లో చాలా సినిమాల్లో నటించాను. హీరోగా ఈ బ్యానర్లో నాకు అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ విత్ పాన్, ఐస్ క్రీమ్ లా ఉంటుందని, నా సినిమాల్లో ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఇందులో ఉంటాయన్నారు. దర్శకుడు తేజ '1000 అబద్దాలు' లో నటిస్తున్న ఈస్తర్ ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా చేస్తోంది

ఈ చిత్రాన్ని కలిసుందాం రా, రారాజు వంటి చిత్రాలు డైరక్ట్ చేసిన తమిళ దర్శకుడు ఉదయశంకర్ డైరక్ట్ చేస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రం నిర్మితమవుతుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా... ఎస్తర్ అనే కొత్త అమ్మాయి చేస్తోంది. ఆమె ఇప్పటికే సాయిరాం శంకర్ సరసన వెయ్యి అబద్దాలు చిత్రంలో చేస్తోంది. దర్శకుడు ఉదయ్ శంకర్ మాట్లాడుతూ.... ఈ కథకి సునీల్ పర్ ఫెక్టుగా సూటవుతాడని అతన్ని హీరోగా ఎంచుకున్నాము. ఎంటర్‌టైన్మెంట్ అండ్ కామెడీకి ఫుల్ స్కోపు ఉన్న సినిమా. సునీల్ బర్త్ డే రోజు ఈ కథను ఆయనకు రెండు గంటలపాటు వివరించాను. బర్తడే గిఫ్ట్ గా నా సినిమాలో హీరోగా చేయడానికి ఆయన ఒప్పుకున్నారు అని చెప్పారు.

నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ... సునీల్ తో ఎప్పటి నుంచో మా బ్యానర్లో సినిమా చేయాలనుకుంటున్నాము. ఈ రోజుతో అది కుదిరింది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి విశేషాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ఈచిత్రానికి కథ: కవి కాళిదాస్, మాటలు: శ్రీధర్ సీపాన, ఆర్ట్: వివేక్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: శేఖర్ వి.జోసెఫ్, సంగీతం: మణి శర్మ, సమర్పణ: డా. డి రామానాయుడు, నిర్మాత, సురేష్ బాబు, దర్శకత్వం-స్క్రీన్ ప్లే: ఉదయ్ శంకర్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X