హాట్ న్యూస్: సునీల్ సినిమా ఆగిపోయినట్లే!?

By Srikanya

సునీల్‌ హీరోగా సురేష్‌ ప్రొడక్షన్‌ బ్యానర్ లో 'సంబరాల రాంబాబు' చిత్రం మొదలైన సంగతి తెలిసిందే. అయితే ఫిల్మ్ సర్కిల్స్ లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగిపోయిందని వినపడుతోంది. కొద్ది రోజుల క్రితం డి.సురేష్‌ బాబు సునీల్‌ సినిమా అట్టహాసంగా ప్రారంభించారు. కలిసుందాం రా ఫేమ్‌ ఉదయ శంకర్‌ దర్శకత్వంలో ఈ సినిమా మొదలెట్టారు. అయితే దర్శకుడుకి, నిర్మాతకి వచ్చిన విభేధాలుతో సినిమా ఆగిపోయినట్లు చెప్పుకుంటున్నారు. అయితే అపీషియల్ గా న్యూస్ రాలేదు.

ఇక ఈ సినిమా ఆగిపోవటానికి కారణం బడ్జెట్‌ ఎక్కువ కావడమేనని చెప్పుకుంటున్నారు. స్క్రిప్టుపై అప్పటికే రెండేళ్లుకు పైగా కసరత్తులు చేసి ఈ ప్రాజెక్టు కోసం ఎదురుచూసిన ఉదయ్ శంకర్ కి ఇది నిరాశపరిచే అంశమే. గతంలోనూ సురేష్ ప్రొడక్షన్స్ ఇదే పంధాలో దర్శకుడు తేజతో మొదలెట్టిన సావిత్రి ప్రాజెక్టుని అటెకెక్కించేసారు. ఆ సినిమామీద తేజ దాదాపు రెండు సంవత్సరాలుకు పైగా సురేష్ ప్రొడక్షన్స్ లో కుస్తీ పట్టారు.

ఇక ఈ చిత్రం తీసుకున్న డేట్స్ లో అమృతం సినిమాని గుణ్ణం గంగరాజుతో లాగించేయాలని సురేష్ బాబు ప్లాన్ చేసారని తెలుస్తోంది.గుణ్ణం గంగరాజు డైరక్ట్ చేసిన జస్ట్ ఎల్లో వారి అమృతం టీవి సీరియల్ తెలుగు వారికి సుపరిచితమే. ఓ హోటల్ చుట్టూ తిరిగే కథలో అల్లుకున్న ఎపిసోడ్స్ తో వారం వారం తెలుగువారిని గిలిగింతలు పెట్టిన ఈ టీవీ సీరియల్ సినిమాగా రానుంది. సునీల్ హీరోగా రూపొందే ఈ చిత్రాన్ని గుణ్ణం గంగరాజే తెరకెక్కించనున్నారని చెప్తున్నారు. సురేష్ బాబు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహించనున్నారని సమాచారం.

జస్ట్ యల్లో బ్యానర్ ,సురేష్ ప్రొడక్షన్స్ కలిపి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని సమాచారం. అయితే సీరియల్ క్యారెక్టర్స్ తో సినిమా చేస్తారా లేక, కథ కూడా తీసుకుని చేస్తారా అనేది మాత్రం తెలియటం లేదు. ఇప్పటికే ఈ చిత్రం స్క్రిప్టు పూర్తైందని తెలుస్తోంది. త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రానుందని వినికిడి. పూర్తి స్ధాయి కామెడీగా ఈ చిత్రాన్ని గుణ్ణం గంగరాజు తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X