సునీల్,రాజశేఖర్ కాంబినేషన్ ఖరారు

By Srikanya

Sunil in 'Varuthapadatha Valibar Sangam' re-make
హైదరాబాద్ : తఢాఖా చిత్రంలో నాగచైతన్య తో కలిసి హీరోగా చేసిన సునీల్ మరోసారి ఇలాంటి స్కీమ్ తో మన ముందుకు రాబోతున్నాడు. తమిళంలో విజయవంతమైన 'Varuthapadatha Valibar Sangam'చిత్రం రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ సారి రాజశేఖర్ తో కలిసి సునీల్ చేయనున్నారు.ఈ చిత్రం రీమేక్ రైట్స్ ని సురేష్ కొండేటి ప్యాన్సీ రేటు పెట్టి తీసుకున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. త్వరలోనే అఫీషియల్ గా ఈ చిత్రం గురించి ప్రకటన వస్తుందని చెప్తున్నారు. తమిళంలో ఏడు కోట్లతో నిర్మితమైన ఈ చిత్రం దాదాపు 30 కోట్లకు పైగా మొదటి మూడు వారాల్లో కలెక్టు చేసింది.

మరో ప్రక్క తమిళంలో విజయవంతమైన 'సుందరపాండ్యన్‌' చిత్రాన్ని తెలుగులో సునీల్‌ హీరోగా తెరకెక్కిస్తారని సమాచారం. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లబోతోందని సమాచారం. ప్రస్తుతం సునీల్‌ ' భీమవరం బుల్లోడు' చిత్రంలో నటిస్తున్నారు.

గతంలో తమిళ పదం రీమేక్ ..సుడిగాడు హిట్ ఇచ్చిన భీమినేని మరోసారి ఈ రీమేక్ తో హిట్ కొట్టడానికి సిద్దమవుతున్నారు. రీసెంట్ గా సునీల్ తో చేసిన తమిళ చిత్రం వెట్టై రీమేక్ గా వచ్చిన తడాఖా చిత్రం మాత్రం మంచి సక్సెస్ అయ్యింది. ఆ చిత్రంలో సునీల్ పిరికివాడైన పోలీస్ గా కనిపించారు. ఈ చిత్రాలతో పాటు లేడీ డైరక్టర్ బి.జయ దర్శకత్వంలో ఆయన హీరోగా చిత్రం త్వరలో తెరకెక్కనుంది. ఈ చిత్రానికి సంభందించి స్క్రిప్టు వర్క్ ఇప్పటికే పూర్తైందని సమాచారం. లవ్ లీ చిత్రం తో హిట్ కొట్టిన బి.జయ ఈ చిత్రాన్ని కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కించటానికి సన్నాహాలు చేస్తోందని సమచారం.

ఇప్పటి వరకు అల్లరి చిల్లర పాత్రల్లో నటించిన సునీల్ త్వరలో ఓ విభిన్నమైన పాత్రలో తెరపై కనిపించబోతున్నాడు. 'భక్త కన్నప్ప'గా సునీల్ నటించబోతున్నాడని సమాచారం. ఈ చిత్రానికి తనికెళ్ల భరణి దర్శకత్వం వహించబోతున్నారట. ఇప్పటికే భక్త కన్నప్ప కథ తెలుగులో రెండు సార్లు తెరకెక్కింది. గతంలో కన్నడ కంఠీవర రాజ్ కుమార్, రెబల్ స్టార కృష్ణం రాజు లాంటి లెజెండ్స్ భక్త కన్నప్ప పాత్రలను పోషించారు. అయితే ఈ సారి తనికెళ్ల భరణి ఆ పాత్రకు సునీల్‌ను ఎంచుకోవడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X