అల్లు అర్జున్ కాదన్నాడు...సీన్ లోకి సునీల్

By Srikanya

హైదరాబాద్: అల్లు అర్జున్ హీరోగా వాసు వర్మ దర్శకుడుగా లవర్ అనే చిత్రం రూపొందబోతోందంటూ ఆ మధ్యన వార్తలు వచ్చాయి. లవర్ టైటిల్ మీద కూడా వివాదం రేగింది. దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నర్మిస్తాడని ప్రచారం జరిగింది. అయితే ఏమైందో ఏమో సీన్ లోకి సునీల్ వచ్చాడు. అల్లు అర్జున్ నో చెప్పాడు కాబట్టే సునీల్ తో చిత్రం చేసి హిట్ కొడదామని వాసు వర్మ ఫిక్స్ అయ్యాడంటున్నారు. జోష్ తో పరిచయమైన వాసువర్మ దర్శకుడుగా మరో చిత్రం రావటానికి ఇంతకాలం పట్టింది.

సునీల్‌ హీరోగా వాసు వర్మ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. దిల్‌ రాజు నిర్మాతగా వ్యవహరిస్తారు. ''విదేశీ నేపథ్యంలో సాగే పూర్తి స్థాయి వినోదాత్మక కథ ఇది. 'మర్యాద రామన్న' తరహాలో సునీల్‌కు మంచి పేరును తీసుకొస్తుంది. ఆగస్టులో ఈ సినిమాను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. త్వరలో పూర్తి వివరాలు ప్రకటిస్తాము''అని దిల్‌ రాజు తెలిపారు.

Sunil – Vasu Varma movie to be launched soon

పూలరంగడు అనంతరం ఒక్క హిట్టూ కొట్టలేని సునీల్ కి ఇది కీలకమైన సమయం. దాంతో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. అయితే అతనితో సినిమా చెయ్యాలని చాలా మంది దర్శకులు వెయిట్ చేస్తున్నారు. చాలా కథలు కూడా ఓకే చేసాడని సమాచారం. అందులో తణికెళ్ల భరణి, గోపి మోహన్ వంటి వారు కూడా ఉండటం విశేషం.

మరో ప్రక్క తమిళంలో విజయవంతమైన 'సుందరపాండ్యన్‌' చిత్రాన్ని తెలుగులో సునీల్‌ హీరోగా తెరకెక్కిస్తారని సమాచారం. ఇటీవలే కథ విన్న సునీల్‌ ఇందులో నటించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కథాచర్చలు సాగుతున్నాయని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లబోతోందని సమాచారం.

ఈ చిత్రానికి 'సుందర్ అండ్ కో ' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఈ చిత్రం రీపొందనుంది. తెలుగులో రీమేక్‌ సినిమాలు తీయడంలో పెట్టింది పేరు... భీమనేని శ్రీనివాసరావు. ఇదివరకు ఆయన తీసిన పలు చిత్రాలు విజయవంతమయ్యాయి. ఏడాది కిందట నరేష్‌తో 'సుడిగాడు' చిత్రాన్ని తెరకెక్కించి విజయాన్ని అందుకొన్నారు. తాజాగా మరో సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X